Listen to this article

దేశ అభ్యున్నతికి ఆయన కృషి అందరికీ స్ఫూర్తిదాయకం

రాజ్యాంగమే దేశానికి శ్రీరామరక్ష

సంస్కరణలకు ఆద్యుడు అంబేద్కర్‌

తహశీల్దార్ ఆంజనేయులు, ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్

జనం న్యూస్ ఏప్రిల్ 15(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ సంస్కరణలకు ఆద్యుడని,రాజ్యాంగ నిర్మాతగా భారతీయుల గుండెల్లో చిరస్థాయిగా ఎప్పటికి నిలిచిపోయిన మహనీయుడు డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ అని తహసిల్దార్ ఆంజనేయులు అన్నారు. సోమవారం మునగాల మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్ తో కలిసి తహసిల్దార్ ఆంజనేయులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తహసిల్దార్ మాట్లాడుతూ..అంబేద్కర్‌ బడుగు, బలహీనవర్గాలు, దళితుల సంక్షేమం కోసం పోరాడిన యోధుడని పేర్కొన్నారు. ఆయనలోని నాయకత్వ లక్షణాలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు.అట్టడుగు వర్గంలో జన్మించి ఎన్ని అవాంతరాలు ఎదురొచ్చినా ఉన్నత చదువులు చదివిన గొప్ప వ్యక్తి ఆంబేద్కర్‌ అని అన్నారు. విద్యార్థి దశ నుంచే కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించిన మహావ్యక్తి అంబేద్కర్‌ అని కొనియాడారు.ఈ సందర్భంగా ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్ మాట్లాడుతూ..భారతదేశంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన వ్యక్తి అంబేద్కర్‌ అన్నారు.దేశంలో పుట్టిన ఎంతో మంది మహానుభావుల్లో అన్ని వర్గాలు, అన్ని కులాలకు ముఖ్యంగా మానవజాతి కోసం పోరాడిన వ్యక్తి అంబేద్కర్‌ అని ఆయన అన్నారు. ప్రస్తుత సమాజంలో ఏ ఒక్క రంగాన్ని తీసుకున్న ఆయన యొక్క ప్రత్యేక ముద్ర, ఆయన యొక్క ప్రత్యేకత మనకు స్పష్టంగా కనబడుతుం దన్నారు. ఒక వర్గం కోసమే కాకుండా అన్ని వర్గాల ప్రజలకు కోసం ఆయన గొంతెత్తి పోరాడారని అన్నారు.