

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా
.నందలూరు బస్టాండ్ కూడలి లో కన్నులు పండుగగా బాబాసాహెబ్ జయంతి వేడుకలు.జయంతి వేడుకల్లో పెద్ద ఎత్తున కూటమి నాయకులుఅలరించిన కోలాటం. పెద్ద ఎత్తున అన్నదానంరాజ్యాంగ నిర్మాత మహానుభావుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరు ముందుకు సాగాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడ విజయ శేఖర్ రెడ్డి ఆర్టీసీ మాజీ రీజనల్ చైర్మన్ ఎద్దుల సుబ్బరాయుడు భాజపా జిల్లా అధ్యక్షుడు సాయి లోకేష్ అన్నారు. నందలూరు బస్టాండ్ కూడలిలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను నాగిరెడ్డిపల్లి సర్పంచ్ జంబు సూర్యనారాయణ నేతృత్వంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మేడా విజయ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ యావత్ ప్రపంచ దేశాలు భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాయన్నారు రాజ్యాంగం రచించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు మన దేశం ఎప్పుడు రుణపడి ఉంటుందన్నారు. బడుగు బలహీన వర్గాలకు ఎప్పుడూ అండగా ఉంటామని అంతా కలిసి జీవించాలన్నారు. మాజీ ఆర్టీసీ రీజినల్స్ చైర్మన్ ఎద్దుల సుబ్బరాయుడు మాట్లాడుతూ మనుషులంతా ఒక్కటేనని కులమత బేధాలు లేకుండా జీవించాలన్న సంకల్పం అంబేద్కర్ ఆశయంలో నుంచి బయటికి వచ్చిందన్నారు. అందుకు అనుగుణంగామనం ముందుకెళాలన్నారు. భాజపా జిల్లా అధ్యక్షుడు సాయి లోకేష్ మాట్లాడుతూ దేశం అన్ని విధాల ముందుకు వెళుతుందంటే దానికి రాజ్యాంగం కారణమన్నారు.