Listen to this article

టైం పాస్ కావడానికిప్రెస్ మీట్ లు..


విషయ పరిజ్ఞానం లేకుండా ఆరోపణలు..


ఆపై జారుకోవడం..

కమలాపూర్ లో ఘనంగా అంబేడ్కర్ జయంతి వేడుకలు..

జనం న్యూస్ // ఏప్రిల్ // 15 // కుమార్ యాదవ్ // జమ్మికుంట..

స్కాంలకు కేరాఫ్ అడ్రస్ బీఆర్ఎస్ పార్టీ అని,బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి ఉన్నప్పుడు అనేక స్కాంలు చేశారని,నిరాధార ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియా ముందు, హైలెట్ కావడానికి కౌశిక్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు.సోమవారం నాడు కమలాపూర్ మండల కేంద్రంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన ర్యాలీ నిర్వహించిన అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ..బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పేపర్ లీకులతో విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడారని,కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించి వారి కుటుంబాల్లో వెలుగులు నింపామని అన్నారు.గ్రూప్ వన్ విషయంలో ఏదైనా సందేహాలు ఉంటే సంబంధిత అధికారులు కలిసి వివరణ అడగాలి కానీ ఏదో జరిగింది,ఏదో అయ్యిందని ప్రజలను తప్పుదారి పట్టించడం సరైన పద్ధతి కాదని ఆయన అన్నారు.అనేకసార్లు సబ్జెక్టు లేని మాటలు మాట్లాడి కౌశిక్ రెడ్డి హుజురాబాద్ పరువు తీస్తున్నాడని మండిపడ్డారు.మా వల్లే కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం..ప్రణవ్. హుజురాబాద్ ప్రజల కష్టాలు తీర్చడంలో స్థానిక ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యాడని ప్రణవ్ అన్నారు.కల్యాణలక్ష్మి చెక్కులు పంచడంలో ఆలస్యం చేయడం వల్ల లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారని గతంలో తాము కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామ వేదికగా చేసిన వ్యాఖ్యలకు కౌశిక్ రెడ్డి లబ్ధిదారులకు చెక్కులు పంచడానికి ముందుకు వచ్చారని,ప్రజల అవసరాలు తీర్చే ఇలాంటి పనుల విషయంలో కూడా జాప్యత వహించడం తగదని వారు అన్నారు.