Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 15 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని జల వాయు విహార్ కాలనీ ల్లో నెలకొన్న పలు సమస్యలు మరియు వాటి పరిష్కారానికై తీసుకోవాల్సిన చర్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై కాలనీ వాసులతో కలిసి పాదయాత్ర నిర్వహించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, నెలకొన్న పలు సమస్యలు మరియు వాటి పరిష్కారానికై తీసుకోవాల్సిన చర్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపైఅని చెప్పగా, తక్షణమే స్పందించి అన్ని డిపార్ట్మెంట్ వారిని సమన్వయ పరచి, ప్రతి సమస్యను వివరించి, త్వరితగతిన సమస్యలను పరిష్కరించాలని చెప్పడం జరిగింది, అలానే పలు కాలనీ లలో ప్రజల నుండి వచ్చిన వినతి మేరకు మరియు మా దృష్టికి వచ్చిన సమస్యలను పరిగణలోకి తీసుకొని ప్రత్యేక చొరవ తో డివిజన్ లో అత్యవసరం ఉన్న చోట, నిత్యం సమస్యలతో ఉన్న ప్రాంతలలో ప్రథమ ప్రాధాన్యత గా పనులు పూర్తి చేస్తామని నార్నె శ్రీనివాసరావు తెలియచేశారు. ఏ చిన్న సమస్య అయిన నా దృష్టికి వచ్చిన తప్పకుండా పరిష్కరిస్తామని, కాలనీ లలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ కాలనీలను అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకు వెళుతు సమస్య రహిత ఆదర్శవంతమైన కాలనీ లు గా తీర్చిదిద్దడమే నా ప్రథమ లక్ష్యం అని, ప్రజలకు స్వచ్ఛమైన, చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కలిపిస్తామని నార్నె శ్రీనివాసరావు చెప్పడం జరిగినది, అలానే అన్నివేళలా ప్రజలకు అందుబాటులోకి ఉంటానని, మెరుగైన ప్రజా జీవనానికి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని,  అదే విధంగా హైదర్ నగర్ డివిజన్ ను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన, అగ్రగామి డివిజన్గా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జి హెచ్ ఎం సి ఏఈ రాజీవ్, వర్క్ ఇన్స్పెక్టర్ దేవి, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ దాసు, ఎండమాలజి డిపార్ట్మెంట్ నరసింహ, జిహెచ్ఎంసి ఎలక్ట్రికల్ నరేష్ ఎస్ ఆర్ పి సత్యనారాయణ, హెచ్ ఎం డబ్ల్యు ఎస్ ఎస్ వి ఏఈ ప్రియాంక, సూపర్వైజర్ నరేంద్ర మరియు మరియు కాలనీ వాసులు పాల్గొనడం జరిగింది.