Listen to this article

జనంన్యూస్. 15. సిరికొండ. ప్రతినిధి.

పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్. మరియు జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి. సహకారంతో సిరికొండ మండలంలో రైతులకు అతి తక్కువ ధరకు తాడిపత్రి షీట్లు, సిరికొండ మండలంలో వర్షాకాలంలో ధాన్యం తడవకుండా రక్షించేందుకు, రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని తాడిపత్రి GSM250 క్వాలిటీ షీట్లను అతి తక్కువ ధరకు సబ్సిడీపై నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ ధర్మపురి అరవింద్ గారు మరియు జిల్లా అధ్యక్షులు శ్రీ దినేష్ కుల చారి గారి సహకారంతో అందజేయడం జరిగింది. ఈ తాడిపత్రి షీట్లు వర్షపు నీటిని తట్టుకునే మేలైన నాణ్యతతో ఉండడమే కాకుండా, సామాన్య రైతులకు అందుబాటులో ఉండేలా సబ్సిడీతో కల్పించడం జరిగింది. రైతులు ఈ అవకాశం లభించడంపై ఆనందం వ్యక్తం చేస్తూ, తమ అభినందనలు తెలిపారు. ఇది రైతులకు మద్దతుగా శ్రీ ధర్మపురి అరవింద్ గారు తీసుకున్న ఓ సానుకూల నిర్ణయం అనే అభిప్రాయం వ్యక్తమైంది.

ఈ కార్యక్రమంలో సిరికొండ మండలం నాయకులు అల్లూరి రాజేశ్వర్ రెడ్డి గారు, ధర్పల్లి బాబురావు, పోతుగంటి మధు, బచ్చు మారుతి, సూరి నీడ గోపి, కామాని కిరణ్, తదితరులు పాల్గొన్నారు