Listen to this article

జనంన్యూస్. 15. సిరికొండ.

నిజామాబాదు జిల్లా సిరికొండ మండల కేంద్రం లోని గాడ్కోల్ గ్రామం లో ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు కూలీ డబ్బులను ఇప్పించకుండా అవకతవలకు పాల్పడిన ఫీల్డ్ అసిస్టెంట్ ను శాశ్వతంగా విధుల నుంచి తొలగించి కూలీలకు న్యాయం చేయాలని ఏఐకేఎంఎస్ మండల అధ్యక్షులు నిమ్మల భూమేష్ ఎల్లయ్య లు ఎంపీడీవో మనోహర్ రెడ్డికి వినతి పత్రాన్ని సమర్పించారు. సిరికొండ మండల కేంద్రంలో మంగళవారం ఉపాధి కూలీలు ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ గత సంవత్సరం గడుక్కోలు గ్రామంలో ఉపాధి హామీలో అవకతవకలకు పాల్పడి సస్పెండ్ అయిన వ్యక్తిని మళ్లీ తిరిగి విధుల్లోకి తీసుకొని కూలీల పొట్ట కొడుతున్నారని వారు అన్నారు. అతనిపైన ఎంక్వయిరీ వేసి శాశ్వతంగా విధుల నుంచి తొలగించాలని పలుమార్లు గ్రామ సభలలో తీర్మానాలు సమర్పించిన అధికారులు పట్టించుకున్న పాపాన పోవట్లేదు అని కూలీలు వాపోయారు అని వారు అన్నారు. తక్షణమే అతనిని విధుల నుంచి శాశ్వతంగా తొలగించి కూలీలకు న్యాయం చేయవలసిందిగా ఎంపీడీవోను కోరారు. నాలుగు సార్లు సస్పెండ్ అయిన వ్యక్తిని మళ్లీ విధుల్లోకి తీసుకోవడం ఎంతవరకు సబబు అని వారు అన్నారు. 10 వారాలుగా కూలీలకు కూలీ డబ్బులు రావడంలేదని వారం వారం చిట్టిలను కూడా ఇవ్వడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే కూలీల డబ్బులను వారి ఖాతాల్లో జమ చేయాలని వారం వారం వారికి చిట్టీలను అందజేయాలని వర్క్ సైడ్ ఫెసిలిటీస్ ని కల్పించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో వి బాలయ్య, ఏఐకేఎంఎస్ మండల అధ్యక్షులు నిమ్మల భూమేష్, ఎల్లయ్య, గ్రామ శాఖ అధ్యక్షులు గులాం హుస్సేన్, చిన్న గంగాధర్, ఉపాధి హామీ కూలీలు పూసల బీఖ్య, లింబ్య, రాములు, బుజ్జి, యమునా, శంకర్, జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.