

జనం న్యూస్ ఏప్రిల్ 15 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
శ్రీరామరక్ష రథయాత్ర రెండవ రోజు మునగపాక మండలం అరబుపాలెం గ్రామం నుండి రథయాత్ర ప్రారంభమైంది. రథయాత్ర లో ఎలమంచిలి శాసనసభ్యులు సుందర్ విజయకుమార్ పాల్గొని అయోధ్య రామని దర్శించుకుని హారతి ఇచ్చారు. ఈ సందర్భంగా సుందరపు మాట్లాడుతూ నియోజకవర్గంలో అయోధ్య రామరక్షారధ యాత్ర నిర్వహించడం ప్రజలందరికీ శ్రీరామరక్షని ఈ రథయాత్ర మొత్తం విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్ నిర్వహించడం మన అదృష్టమని అన్నారు. విశాఖ డైరీ చైర్మన్ ఆనంద్ కుమార్ ,ఎలమంచిలి మున్సిపల్ చైర్ పర్సన్ పిల్లా రమాకుమారి,బడే రవి, కలిదిండి శివాజీ బహదూర్, దాట్ల వర్మ, బోరవెల్లి ప్రమోద్ కుమార్, ద్వారపరెడ్డి పరమేశ్వరరావు, సమరసత సేవ ఫౌండేషన్ ఉత్తరాంధ్ర జోన్ ధర్మ ప్రచారక్ ఎల్లపు సంతోష గంగాధర్,పప్పు ఈశ్వరరావు, దొడ్డిశ్రీను,దొడ్డి బుజ్జి త్రివేణి ధనలక్ష్మి. పరశురాం.అరబుపాలెం, గ్రామ సర్పంచ్ బొడ్డేడ శ్రీనివాసరావు మాజీ ఎంపిటిసి తరగడం శ్రీనివాసరావు, వాడ్రపల్లి,మూలపేట,పాటిపల్లి గ్రామాల సర్పంచులు పాలు సొసైటీల అధ్యక్షులు పెద్దలు పోరాటం బృందాలు, స్వామి గరిడీలు, చెట్టు భజనలు, హరి భజనలు ,భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.//