

జనం న్యూస్,15ఎప్రిల్2025.
కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. కంటే ఏలియా.
ఒక లాయరు నలభై ఆరు మంది దోషుల్ని ఉరిశిక్ష నుండి విడుదల చేయించాలని కోర్టులో సీరియస్‌గా వాదిస్తున్నారు. లాయర్ అసిస్టెంట్ చిన్న చీటీ తీసుకొచ్చి ఇచ్చాడు. అది చూసుకుని…లాయర్ దాన్ని జేబులో పెట్టుకుని, తన వాదన కొనసాగించారు… అందరి చూపు ఆ చిట్టీ మీదనే ఉంది.ఇంతలో లంచ్ టైం అయ్యింది. వాదిస్తుండగా మధ్యలో వచ్చిన చీటీ ఏమిటని న్యాయమూర్తి లాయర్‌ను అడిగాడు… ”నా భార్య చనిపోయింది జడ్జి …” అని చెప్పాడు లాయరు దీనంగా జడ్జి ఆశ్చర్యపోయి ”ఇంకా ఇక్కడేం చేస్తున్నారూ? ముందు ఇంటికి వెళ్ళండి!” అని అరిచినంత పనిచేశాడు జడ్జి ”అయ్యా! నేను వెళ్ళి నా భార్య ప్రాణాలు తీసుకురాలేను…. ఇక్కడ ఉండి వాదించి, నలభై ఆరు మందిని ఉరిశిక్ష నుండి రక్షించగలనేమో కదా?” అని అన్నాడు లాయర్ ఆశగా… అది విన్న బ్రిటిష్ జడ్జి లంచ్ సమయాన్ని రద్దు చేసి వాదనలకు అవకాశమిచ్చారు…. ఆ లాయర్ న్యాయపరమైన అపార మేధాశక్తిని ఉపయోగించి ఆ 46మంది ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు… కోర్టు సమయం ముగిసే అఖరు క్షణం వరకు అవిశ్రాంతంగా వాదించారు… అక్కడున్న మహా మహా మేధావులైన బ్రిటిష్ లాయర్లు ఈ 46మందికి ఉరిశిక్ష కాయమనుకున్నారు…ఆ . నలభై ఆరు మందిని వెంటనే విడుదల చేయాలని జడ్జి ఆదేశించారు. ఆ నలభై ఆరు మంది స్వాతంత్య్ర సమరయోధులు! ఆ లాయరు మరెవరో కాదు, డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్! తన బిడ్డా చనిపోతున్న సమయంలో… ఇంగ్లాండ్ రౌండ్ టేబుల్ సమావేశంలో ఉన్నారు ఒక్కొక్కర్ని కోల్పోతూ… భారత రాజ్యాంగం నిర్మాత గా ఎదిగారు. ఈ స్థాయి దేశభక్తి ఉంటుందని నేటి ఈ కాలపు ఈ దేశభక్తులకు కనీసం అర్థమవుతుందా? ఏమో? తెలియదు…అనుమానమే. అంబేద్కర్ సాక్షిగా ఆలోచనాపరులు మొదలు పెట్టిన శాంతి ఉద్యమ కాగడాను క్రైస్తవులు ప్రజలు అంది పుచ్చుకోవాల్సి ఉంది….. చదువే సామాన్యున్ని మహోన్నత వ్యక్తిగా తీర్చి దిద్దుతుందనడానికి అంబేద్కర్ జీవితమే క్రైస్తవులకు కూడ ఆదర్శం అవ్వాలి…
సేకరణ.కె ఏలియా.
జై యేసు రాజు జై భీమ్ జై జై భీమ్
