

జనం న్యూస్, ఏప్రిల్ 16, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి
గ్రామ స్వరాజ్య సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అన్ని మండలాల్లో ప్రతి మండలం కి ఒక ట్రైనింగ్ సెంటర్ చొప్పున మహిళలకు కుట్టు శిక్షణ ఇచ్చి శిక్షణ అనంతరము ప్రశంసా పత్రము మరియు ఉపాధి అవకాశం చూపించబడును ఈ శిక్షణ 30 రోజుల లో కుట్టు శిక్షణతో పాటు డిజిటల్ అవేర్నెస్ మరియు సైబర్ ఫ్రాడ్స్ గురించి శిక్షణ ఇవ్వబడును. శిక్షణ అనంతరము కుట్టు మిషన్ కావలసిన వారికి సబ్సిడీ మీద కుట్టు మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఆసక్తి గల మహిళలు రిజిస్ట్రేషన్ కోసం జిల్లా గ్రామ స్వరాజ్య సంస్థ జిల్లా కోఆర్డినేటర్ గుండ సంధ్య (9573858145)/ కోతకొండ ధనలక్ష్మి (9652890363)గార్లని సంప్రదించగలరు. దీని ప్రారంభోత్సవ కార్యక్రమం ఈరోజు పెద్దపల్లి ఐటిఐ నందు జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ పప్పుల సుధాకర్ ప్రెసిడెంట్ గ్రామ స్వరాజ్య సంస్థ మరియు డాక్టర్ సలేంద్ర కుమార్ ప్రధాన కార్యదర్శి గ్రామ స్వరాజ్య సంస్థ మరియు ప్రాజెక్టు మేనేజర్ పోలీస్ మాధవి, చలిముల పద్మరావు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.