

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి ఆరవపల్లెలో విశ్రాంత రైల్వే ఉద్యోగి రైల్వే భారత్ స్కౌట్ గ్రూప్ కమిషనర్ కమల్ భాష ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని సర్పంచ్ జంబు సూర్యనారాయణ ప్రారంభించారు. బుధవారం కమల్ భాష ఆధ్వర్యంలో తొలిరోజు ప్రజలకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ జంబు సూరనారాయణ మాట్లాడుతూ రైల్వేద్వారా ఉన్నత సేవలు అందించి పదవి విరమణ పొందినా కూడా ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పం ఎంతో గొప్పదన్నారు. ఇలా ప్రతి ఒక్కరు తమ వంతు ప్రజా సేవలు చేయాలనీ అన్నారు. ప్రజలకు చల్లటి త్రాగునీటిని అందుబాటులో ఉంచడం గొప్ప విషయం అన్నారు. ఈ కార్యక్రమంలో అరవపల్లె షా ధికానా అధ్యక్షులు మహబూబ్ బాషా గుండ్లూరు మాజీ నీటి సంఘం అధ్యక్షులు ముమ్మడి వేణుగోపాల్ రెడ్డి తెలుగుదేశం నాయకులు షేక్ మౌలానా పఠాన్ మెహర్ ఖాన్ పల్లెనాగయ్య కానకుర్తి వెంకటయ్య ఆంజనేయులు గురు ప్రసాద్ గ్రామస్తులు వెంకటేశు గంగిరెడ్డి ఎలుమలై మాబాషా ప్రజలు పాల్గొన్నారు