

జనం న్యూస్, ఏప్రిల్ 17 ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్)
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై సుప్రీంకోర్టు లో విచారణ ముగిసింది. మొత్తం పరిణామాలపై రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఎంపవర్డ్ కమిటీని అఫిడ విట్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించగా.. ఈ మేరకు ఇవాళ జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్‌తో ద్విసభ్య ధర్మాసనం మరో సారి విచారణ చేపట్టింది. అయితే, విచారణ సందర్భంగా కంచ గచ్చిబౌలి భూముల్లో చెట్ల నరికివేతపై చెట్ల నరికివేతపై కోర్టు మరోసారి సీరియస్ అయింది.ఇష్టానుసారంగా చెట్లను నరికి సమర్ధించుకోవడం ఏంటని జస్టిస్ బీఆర్ గవాయి ఆగ్రహం వ్యక్తం చేశారు. చెట్ల పునరుద్ధర ణపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఓ ప్రణాళికతో రావాలని సూచించింది. పర్యవరణ పరిరక్షణలో తాము ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఈ విషయంలో రాష్ట్ర సీఎస్‌ను కాపాడాలను కుంటే.విధ్వంసం సృష్టిం చిన వంద ఎకరాలను ఎలా పునరుద్ధరిస్తారో చెప్పాలని కోర్టు ప్రభుత్వం తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. ఈ క్రమంలోనే ప్రభుత్వ తరఫు న్యాయవాది బదులిస్తూ ఫేక్ వీడియోలతో విపక్షాలు ప్రభుత్వంపై దుష్ప్రచారం చేశాయని ధర్మాసనానికి తెలిపారు. మినహాయింపునకు లోబడే చెట్లను తొలగించామని అన్నారు. ఆ భూముల్లో ప్రస్తుతం అన్ని పనులు నిలిపివేశామని పేర్కొన్నా రు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరా వృతవం కానివ్వబోమని ప్రభుత్వం తరఫు లాయర్ కోర్టుకు విన్నవించారు.
వాదోపవాదాలు విన్న ధర్మాసనం తీర్పు విషయం లో స్టేటస్ కో కొనసాగుతుం దని పేర్కొంది. అదేవిధంగా తదుపరి విచారణను మే పది హేను తారీకు వాయిదా వేసింది. అదేవిధంగా భూముల్లో పర్యవరణాన్ని ఎలా పునరుద్ధరిస్తారు.. ఎంతకాలంలో చేస్తారు, జంతువులను ఎలా సంరక్షిస్తారో చెబుతూ నాలుగు వారాల్లో ప్రణాళికను ఫైల్ చేయాలని మద్యంతర ఉత్తర్వులు కూడా కోర్టు జారీ చేసింది.