

జనం న్యూస్. ఏప్రిల్ 15. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్)
రైతులు పండించిన ధాన్యాన్ని దళారుల చేతిలో మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలి నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు.మంగళవారం హత్నూర మండలంలోని నస్తీపూర్, దౌల్తాబాద్, హత్నూర, కాసాలా, పన్యాల, కొన్యాల, చిక్ మద్దూర్, లింగాపూర్, గోవింద్ రాజ్ పల్లి, సిరిపురం గ్రామాల్లో ఏర్పాటుచేసిన ఐకెపి, పీఏసీఎస్.వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ప్రారంభించారు, ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలలో అమ్ముకుంటే ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర వస్తుందన్నారు. దళారుల చేతులో రైతులు మోసపోవద్దని ఆమె సూచించారు. ప్రభుత్వం ఒక క్వింటల్ ఏగ్రేడ్ ధాన్యానికి 2320 రూపాయలు ప్రకటించిందని తెలిపారు. సన్న వడ్లకు క్వింటాల్ కు 500 రూపాయల బోనస్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు గోనే సంచులు. సుత్లి తాళ్ళు, త్రాగునీరు అందించాల్సిన బాధ్యత అధికారులకు ఉందన్నారు. అదేవిధంగా రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యాన్ని ట్రాన్స్పోర్ట్ కు గాని ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని సూచించారు. అధికారులు కొనుగోలు చేసిన వరి ధాన్యాన్ని రైస్ మిల్ కు తరలించడానికి వెంటనే రైస్ మిల్లర్లకు అలాట్మెంట్ ప్రకటించాలని రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యాన్ని తక్షణమే రైస్ మిల్లర్లకు తరలించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. పోయినసారి రైతుల నుండి సన్న వడ్లను కొనుగోలు చేయడంలో ఆలస్యం చేయడంతో రైతులకు తీవ్ర నష్టం జరిగిందని ఆమె తెలిపారు. ఈసారి అలాంటి జరగకుండా వెంటనే వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో. హత్నూర తహసిల్దార్ పర్వీన్ షేక్ , ఎంపీడీవో శంకర్, ఏపిఎం, మాజీ నెంబర్ వెల్ఫేర్ బోర్డ్ చైర్మన్ ఉమ్మన్నగారి దేవేందర్ రెడ్డి. నాయకులు.దామోదర్ రెడ్డి, దుర్గారెడ్డి, మాజీ ఎంపీపీ వావిలాల నర్సింలు, వైస్ ఎంపీపీ పండుగ లక్ష్మీ రవికుమార్. పిఎసిఎస్ డైరెక్టర్ గుండ రాములు. మాజీ జెడ్పిటిసి ఆశయ్య.రామచంద్రర్ రెడ్డి,మయిని శ్రీకాంత్, ఆగమయ్య. చెక్క రవీందర్ గౌడ్. రామే రాములు. నల్లోల్ల పెంటయ్య. వల్లి గారి నర్సింలు. వల్లి గారి సాయికుమార్. కిషోర్ నేత.మంగలి కిషన్. గొల్ల లక్ష్మయ్య. అజ్మత్ అలీ అజ్జు. సురేష్ గౌడ్. శంకర్. మధు.వివిధ గ్రామాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
