Listen to this article

జనం న్యూస్ // ఏప్రిల్ //16// కుమార్ యాదవ్ // జమ్మికుంట..

వినవంక మండలంలో కొందరు లబ్ధిదారులు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వాలని కాంగ్రెస్ నాయకులు తాసిల్దార్ తో వాగ్వాదానికి దిగారు. వివరాల్లోకి వెళ్ళితే, వినవంక మండలంలో మొత్తం 146 మందికి సీఎంర్, చెక్కులు మంజూరు కాగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 110 మందికి మాత్రమే పంపిణీ చేశారని,, మిగిలిన 36 మందికి సీఎంఆర్, చెక్కులు ఇవ్వాల్సి ఉండగా వారికి ఇవ్వలేదని, కొందరు లబ్ధిదారులతో, కలిసి కాంగ్రెస్ నాయకులు కొమ్మిడి రాకేష్ రెడ్డి, మార్కెట్ డైరెక్టర్ శ్రీపతి రెడ్డి,మేకల ఎల్లారెడ్డి, నల్ల కొండల రెడ్డి, యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సతీష్ కుమార్ మరియు కొంతమంది కార్యకర్తలతో, ఎమ్మార్వో ఆఫీస్ కి, వెళ్లి ఎమ్మార్వో ని చెక్కులు ఇవ్వాలని అడగారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి రెండు రోజులలో ఇస్తానని చెప్పారని తాను ఇప్పుడు ఇవ్వలేనని, తాసిల్దార్ శ్రీనివాస్ సమాధానం చెప్పారాని నాయకులు, తెలుపగా, దీనితో ఇంకా గొడవ ఎక్కువ కావడముతో, తాసిల్దార్ శ్రీనివాస్ వినవంక, ఎస్ఐ తోట తిరుపతి కి సమాచారం ఇవ్వగా,ఎమ్మార్వో, కార్యాలయానికి వినవంక ఎస్సై తిరుపతి చేరుకుని,, కాంగ్రెస్ నాయకులతో మాట్లాడి వారికి నచ్చచెప్పారు. తర్వాత తాసిల్దార్ జిల్లా అధికారులకు, మరియు ఎమ్మెల్యేకు కౌశిక్ రెడ్డికి, సమాచారం ఇవ్వగా, లబ్ధిదారులు హుజురాబాద్ క్యాంప్ ఆఫీస్ కు రావాలని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తెలపడంతో లబ్ధిదారులు, హుజరాబాద్ క్యాంప్ ఆఫీస్ కు వెళ్లారు. దీంతో గొడవ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ కి రమ్మనగానే సద్దుమణిగిపోయింది,, కాగా తదనంతరం, హుజురాబాద్ లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులకు చెక్కులు అందజేశరని, నాయకులు వెల్లడించారు.