Listen to this article

సరస్వతీ శిశు మందిర్ ప్రిన్సిపల్ హరినాపవన్

రామకోటి రామరాజు కృషి, అమోఘమన్నారు

జనం న్యూస్, ఏప్రిల్ 17 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్)

గజ్వేల్ లో ఈ నెల 22న జరిగే సీతారామ, ఉమామహేశ్వరుల కల్యానానికి గత సంవత్సరం అందించిన విధంగానే ఈ సారి కూడా గోటి తలంబ్రాల కార్యక్రమం శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ శ్రీకారం చుట్టి బుధవారం సరస్వతీ శిశు మందిర్ విద్యాలయంలో నిర్వహించారు. రామనామ స్మరణ చేసి గోటితో వడ్లను ఓలిచి తలంబ్రాలుగా తయారుచేసి సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజుకు అందజేశారు. అనంతరం సరస్వతీ శిశు మందిర్ ప్రిన్సిపాల్ కొరిడే హరినాపవన్ మాట్లాడుతూ భద్రాచల సీతారాముల కళ్యానానికి మా వంతుగా గోటి తలంబ్రాలు అందించామని, అదే విధంగా మన గ్రామంలోని గజ్వేల్ లో జరిగే సీతారామ, ఉమామహేశ్వరుల కళ్యానానికి కూడా అందించే మహా భాగ్యం కలగడం మమ్మల్ని కూడా బాగా స్వాములను చేసినందుకు రామకోటి రామరాజు కృషి, పట్టుదల అమోఘం అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు గుండు గాయత్రీ, రజిత, భవాని, అక్షర, ప్రణయ, లావణ్య, అంజలి పాల్గొన్నారు.