Listen to this article

జనం న్యూస్,ఏప్రిల్16అచ్యుతాపురం:విశాఖ డైరీ చైర్మన్ ఆనంద్ కుమార్

ఆధ్వర్యంలో అయోధ్య శ్రీరామరక్షా రథయాత్ర రథాన్ని ఘనంగా స్వాగతం పలికి గ్రామంలోకి తీసుకురావాలని ధర్మ రక్షా సమితి కార్యదర్శి కొల్లి అప్పారావు అన్నారు.ఎలమంచిలి నియోజకవర్గంలో నాలుగు మండలాలలో గ్రామ గ్రామానికి తీసుకెళ్లాలని సంకల్పంతో ఈ నెల 13వ తేదీన మునగపాక మండలంలో ప్రారంభమైంది.ముందుగా ప్రతి గ్రామంలోనూ పెద్దలను కలిసి శ్రీరామరక్షా రథయాత్రను విజయవంతం చేయాలని గ్రామ కమిటీలు వేయటం. సర్పంచులను పెద్దలను ఆహ్వానించడం జరుగుతుందన్నారు. దీనిలో భాగంగా ఈరోజు తంతడి రాజన్నపాలెం, గండివాని పాలెం, దోసూరు,మడుతూరు, అప్పన్నపాలెం మరియు రామన్నపాలెం గ్రామాలలో పెద్దలను సర్పంచులను ఆహ్వానించి కమిటీ వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో విశాఖ డైరీ అచ్చుతాపురం మండల మేనేజర్ పడాల గురునాథరావు, సూపర్వైజర్ కన్నూరు వరహా మూర్తి, తంతడి సర్పంచ్ మరియు చోడపల్లి సత్యం, చెల్లిబోయిన కృష్ణ, దొడ్డి అప్పారావు, రాజన్నపాలెం సర్పంచ్ రాజాన నానాజీ, శర్మ మాస్టారు, రామన్నపాలెం ఎంపిటిసి లాలం శీను,ధర్మిరెడ్డి రాము, సత్యం తదితరులు పాల్గొన్నారు.