

జనంన్యూస్16 ఏప్రిల్ భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి
భానుడి ప్రతాపం తో ఎండ వేడికి ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలి అంటే జంకు తున్నారు. ఎండ వేడికి ప్రాణాలు పోయే పరిస్థితులు ఉన్నాయి అని వడదెబ్బ తగలకుండా ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలి అని మండల వైద్యాధికారులు తెలిపారు ఎక్కువ లేదా మోతాదులో మంచి నీళ్ళు త్రాగాలి అని, చల్లని ప్రదేశంలో ఉండడం, వాటర్ బాటిల్ వెంట ఉంచుకోవడం, కాటన్ దుస్తులను ధరించాలి అని తెలిపారు
వడదెబ్బ లక్షణాలు తలనొప్పి, వాంతులు, జ్వరం, నీరసంగా ఉండటం, చెమటలు పెట్టడం ఇలాంటి లక్షణాలు మొదలైతె వెంటనే మీకు దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రాలలో చూపించి కొని ప్రాణాలను నిలుపుకోవాలని సూచించారు