

భద్రత ఏర్పాట్లు చేసి ప్రజల ప్రాణాలు కాపాడాలి
జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
జనం న్యూస్ ఏప్రిల్ 17(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)
సూర్యాపేట జిల్లాలోని రోడ్లపై బ్లాక్ స్పాట్లను గుర్తించేందుకు రెవిన్యూ, పోలీస్, ఆర్ & బి, జాతీయ రహదారుల అధికారులు సమన్వయం చేసుకుంటూ సంయుక్తంగా పరిశీలించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు.బుధవారం సూర్యాపేట కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ నందు జిల్లా ఎస్పీ నరసింహ తో కలిసి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ రోడ్ల భద్రతా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సూర్యాపేట జిల్లా పరిధిలో ఎన్ హెచ్ -65 పై 22 బ్లాక్ స్పాట్ లను గుర్తించటం జరిగిందని అక్కడ బ్లీంకంగ్ లైట్స్, స్ట్రాంగ్ స్ట్రిప్స్, సూచన బోర్డులు, బారికేడ్లు, స్పీడ్ బ్రేకర్లు లాంటి భద్రత ఏర్పాట్లు చేసి వాహనాల వేగం తగ్గించి ప్రజల ప్రాణాలను కాపాడాలని అధికారులకి సూచించారు.గతంలో ఎ న్ హెచ్ 365 నందు పోలిమల్ల, ఎర్రపాడు క్రాస్ రోడ్డులో రెండు బ్లాక్ స్పాట్ లను, అలాగే ఎన్ హెచ్ 167 నేరేడుచర్ల నుండి కోదాడ వరకు 8 బ్లాజ్ స్పాట్ లను గుర్తించి తగు భద్రత చర్యలు తీసుకోవాలని కోరగా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకొనందున సంబంధిత ఎఈఈ లపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ 15 రోజులలో భద్రత ఏర్పట్లు చేయాలని హెచ్చరించారు.అలాగే ఎన్ హెచ్ 365 ఎ కోదాడ -ఖమ్మం ఎఈఈ, ఎన్ హెచ్ ఎ ఐ అధికారులు సమావేశం హాజరు కానందున అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసి శాఖ పరమైన చర్యలకి సంబంధిత అధికారులకి నోటీసులు పంపాలని సూచించారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల అమాయకుల ప్రాణాలు పోతున్నాయని మరో సారి ఇలాగే విధుల పట్ల నిర్లక్ష్యం వహించి ఆక్సిడెంట్ లో సామాన్యుల ప్రాణాలు పొతే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.వారం రోజులలో వివిధ శాఖల అధికారులు సమన్వయము చేసుకుంటూ క్షేత్ర స్థాయి లో జిల్లా లోని అన్ని మెయిన్ రోడ్లను పరిశీలించి బ్లాక్ స్పాట్ లను గుర్తించి నివేదిక ఇచ్చి 15 రోజులలో సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలని తెలిపారు.ఖమ్మం సూర్యాపేట రహదారిపై చివ్వేంల మండలం అక్కలదేవిగూడెం వద్ద తహసీల్దార్, ఎస్ ఐ, పంచాయతీ కార్యదర్శి, ఆర్ & బి డి ఈ ప్రజలలో అవగాహన కల్పించి ప్రజలు జాతీయ రహదారిపై ప్రవేశించకుండా చూడాలని తెలిపారు.జాతీయ రహదారులపై లారీలు ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేయకుండా నిర్దేచించిన ప్రదేశం లో మాత్రమే చేసేలా రహదారులపై పెట్రోలింగ్ చేయాలని పేర్కొన్నారు.
సూర్యాపేట కోదాడ హుజూర్ నగర్ పట్టణాలలో ట్రాఫిక్ సిగ్నల్స్ పని చేసేలా చూడాలని తెలిపారు.మున్సిపాల్టీ లలో అధికంగా వాహనాలు తిరిగే చోట, ట్రాఫిక్ సమస్య ఉన్న చోట పార్కింగ్ ప్లేస్ గుర్తించాలని అధికారులకి సూచించారు.ఎస్పీ నరసింహ మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలలో 500 మీటర్ల దూరంలో 5 ఆక్సిడెంట్ లు జరిగితే దానిన్ని బ్లాక్ స్పాట్ గా గుర్తించటం జరుగుతుందని జాతీయ రహదారుల అధికారులు బ్లాక్ స్పాట్ లలో తగిన భద్రత ఏర్పాట్లు చేయకపోవటం వల్ల ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు.ఆర్ టి సి వాహనాలు ప్రయాణికులను దింపేటప్పుడు ఎడమ చేతి వైపు ఇండికేటర్ సిగ్నల్ వేసి రోడ్డు దింపాలని,స్కూల్ కాలేజీ బస్సులు ప్రజలకి ఇబ్బంది కల్గించకుండా చూడాలని తెలిపారు.ఈ కార్యక్రమం లో ఆర్ డి ఓ వేణుమాధవరావు,డి టి ఓ సురేష్ కుమార్,ఆర్ & బి ఎస్ ఈ సీతారామయ్య, అబ్కారి సూపరిటీడెంట్ లక్ష్మనాయక్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్,డి ఈ ఓ అశోక్, డి ఐ ఈ ఓ బాను నాయక్, ఆర్ & బి డి ఈ లు, జాతీయ రహదారి అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.