

జనం న్యూస్ ఏప్రిల్ 17 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి
ప్రశ్నించే ప్రతిపక్షాల గొంతు నొక్కడమే పరిపాలన అనుకుంటూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పాలన సాగిస్తోందని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ ధ్వజమెత్తారు.కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా రాహుల్ గాంధీల పై నేషనల్ హెరాల్డ్ కేసు నమోదు చేసినందుకు నిరసనగా గురువారం ఏఐసిసి పిలుపుమేరకు ఈడీ కార్యాలయం ముందు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా జరిగింది .ఈ కార్యక్రమానికి బండి రమేష్ ఆధ్వర్యంలో పార్టీనాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు స్థానికులు మూసాపేట చౌరస్తా నుంచి ఈ డి కార్యాలయానికి పెద్ద ఎత్తున ర్యాలీగా తరలి వెళ్లారు.ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని మా అగ్ర నేతలను అణగదొక్కాలని కేంద్ర ప్రభుత్వం చూస్తుందని విమర్శించారు.కానీ 140 ఏళ్ల ఘనమైన చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎవరూ ఏమీ చేయలేరన్నారు. ఇలాంటి తప్పుడు కేసులు పెట్టడం వల్ల జరిగేది ఏమి ఉండదన్నారు.వెంటనే రాహుల్ సోనియా పై కేసులు ఎత్తివేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మార్కెటింగ్ కమిటీ మెంబెర్స్, టెంపుల్ కమిటీ మెంబర్స్ ,బ్లాక్ అద్యక్షులు, బ్లాక్ మహిళా అధ్యక్షురాలు, డివిజన్ అధ్యక్షులు, డివిజన్ మహిళా అధ్యక్షురాలు యూత్ కాంగ్రెస్, ఎన్ ఎస్ యు ఐ నాయకులు, మైనారిటీ నాయకులు, ఎస్ సి సెల్ నాయకులు, బీసీ సెల్ నాయకులు మరియు కార్యకర్తలు మరియు కాంగ్రెస్ పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.