Listen to this article

శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం చైర్మన్ ఇంగిలే రామారావు..

జనం న్యూస్ // ఏప్రిల్ // 17 // కుమార్ యాదవ్ // జమ్మికుంట..

శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఇల్లందకుంట కరీంనగర్ జిల్లా అపర భద్రాద్రిగా పిలిచే ఈ క్షేత్రంలో 2025 సంవత్సరం వార్షిక బ్రహ్మోత్సవాల ఏప్రిల్ 4వ తేదీ నుండి 16వ తేదీ వరకు అంటే 13 రోజులపాటు అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ 13 రోజులు కార్యక్రమాల్లో వేల మంది భక్తులు స్వామివార్లను దర్శించుకుని స్వామి వారి కృపకు పాత్రులు కావడం సంతోషం. ఈ 13 రోజులు ఉత్సవాల్లో భాగంగా కళ్యాణం రోజు మరియు పెద్ద వ్రతం రోజు కలుపుకొని సుమారు లక్ష మంది భక్తులు స్వామి వారి దర్శనానికి హాజరు కావడం జరిగింది, భక్తులకు ఏలాంటి ఇబ్బందులు కలగకుండా దేవదాయ శాఖ మరియు ధర్మకర్తల మండలి తరఫున అన్ని ఏర్పాట్లు చేసారు. ధర్మకర్తల మండలి మరియు దేవస్థాన అధికారులు సిబ్బంది సమన్వయంతో పనిచేసి భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఆలయానికి సహకరించిన రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అన్నదానం ఏర్పాటు చేశారు. ఇ సందర్బంగా దేవాలయం చేర్మెన్ రామారావు మాట్లాడతు.. కార్యనిర్వాహణాధికారి, ఆలయ అర్చకులు, దేవస్థాన సిబ్బంది,వారికి మరియు వివిధ ప్రభుత్వ శాఖలు పోలీస్ ,రెవెన్యూ, మున్సిపల్ ,హెల్త్ డిపార్ట్మెంట్, ,ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్, పారిశుద్ధ కార్మికులు విద్యుత్ శాఖ మంచినీరు సప్లై, ఫైర్ సిబ్బంది, మజ్జిగ పంపిణీ చేసిన, వారికీ సేవా సమితి మహిళలకు, ప్రతి ప్రభుత్వ విభాగాల వారు తమ యొక్క సిబ్బందితో భక్తులకు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా ఉత్సవాలను విజయవంతం కావడానికి ప్రత్యేకంగా సహకరించిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, మండల ప్రజలకు దేవస్థానం యొక్క అధికారుల సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలుపారు. శ్రీ సీతారామచంద్రస్వామి కృప ఉండాలని ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసిన భగవత్ భక్తులకు మరియు ధర్మకర్తల మండలికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను అన్నారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు పరమేశ్వర్,రవికిరణ్,గోపాల్ రెడ్డి ,మలేష్,కిషన్ రెడ్డి, లావణ్యశ్రీనివాస్ ,చిరంజీవి,రామ్ రెడ్డి,నాగరాజు,మధుకర్ రెడ్డి,నారాయణ రెడ్డి,రాజేందర్,తిరుపతి రెడ్డి పాల్గొన్నారు.