Listen to this article

జనంన్యూస్. 18. నిజామాబాదు. సిరికొండ.

నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి సిరికొండ మండలంలోని పలు గ్రామాలలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. చిమనపల్లి గ్రామంలో త్వరలోనే బ్యాంకు ఏర్పాటుకు తన వంతుగా ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. త్వరలోనే బ్యాంకు అధికారులు గ్రామానికి వచ్చి చూస్తారని ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేశారు. అలాగే. గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కూడా శంకుస్థాపన చేశారు. నిజామాబాద్ జిల్లా చిట్టచివరి విలేజి తాటి పెళ్లి గ్రామంలో నేడు సబ్ స్టేషన్కు శంకుస్థాపన చేశారు. మార్గమధ్యంలో పెండింగ్లో ఉన్న రెండు కిలోమీటర్ల రోడ్డు కూడా త్వరలోనే బాగు చేయిస్తానని హామీ ఇచ్చారు