



గత పాలకులు కటింగ్ ల పేరిట రైతులను దోచుక తిన్నారు..
సన్న వడ్లకు బోనస్ అందించడంలో పెద్దపల్లి నియోజకవర్గం రాష్ట్రంలోనే టాప్..
పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు.
జనం న్యూస్, ఏప్రిల్ 19, పెద్దపెల్లి జిల్లా ప్రతినిధి
సుల్తానాబాద్ మండలం నారాయణరావుపల్లె, గొల్లపల్లి, సాంబయ్యపల్లి, ఐతరాజుపల్లి, భూపతిపూర్, గర్రెపల్లి, బొంతకుంటపల్లి, నరసయ్యపల్లి, నీరుకుల్ల, గట్టేపల్లి, కదంబాపూర్, తొగర్రాయి గ్రామాల్లో శుక్రవారం సింగిల్ విండో, ఐకెపి ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించిన గౌరవ పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు .. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ… ఆరుగాలం కష్టపడి, చెమటోడ్చి పండించిన రైతుల కష్టార్జితాన్ని గత ప్రభుత్వంలోని పెద్దలు కటింగ్ ల పేరిట ఏ విధంగా అవినీతికి పాల్పడినారో ప్రజలందరికీ తెలుసు అని అన్నారు. తాము పూర్తి పారదర్శకంగా రైతులకు న్యాయం చేకూర్చేందుకు పనిచేస్తున్నామని చెప్పారు. అధికారంలో లేనప్పుడు వడ్ల కటింగ్ లకు వ్యతిరేకంగా పోరాటం చేశామని, ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత మాటకు కట్టుబడి, ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ఎక్కడ కటింగ్లు లేకుండా వడ్ల కొనుగోలు జరుపుతున్నామని చెప్పారు. కొనుగోలు కేంద్రాలలోకి ధాన్యం తీసుకువచ్చి తమ తమ సీరియల్ నంబర్ పొంది రైతులు నిరంధిగా ఉండవచ్చని రైతు పంట తూకం అయిన 48 గంటల్లోనే వారి ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సారి కూడా సన్న వడ్లకు బోనస్ అందిస్తామని చెప్పారు. గత సీజన్లో సన్న వడ్ల బోనస్ రాష్ట్ర మొత్తం మీద ప్రభుత్వం రైతులకు 1234 కోట్ల రూపాయలు అందించగా, అందులో ఒక్క పెద్దపల్లి నియోజకవర్గంలోనే అత్యధికంగా 59 కోట్ల 65 లక్షల రూపాయల బోనస్ ను రైతులు పొందారని చెప్పారు. అకాల వర్షాల వల్ల దురదృష్టవశాత్తు పంటలకు నష్టం జరిగితే రైతులు అధైర్య పడవద్దని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. దెబ్బతిన్న వడ్లను కూడా కొనుగోలు చేసే విధంగా కృషి చేస్తానని చెప్పారు. త్వరలోనే అన్ని గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ళను మంజూరు చేస్తామని చెప్పారు. సుల్తానాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో సిసి రోడ్లకు గాను రూ.1.52 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్టు ఎమ్మెల్యే విజయరమణ రావు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు అంతటి అన్నయ్య గౌడ్, ఏఎంసీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, సింగిల్ విండో చైర్మన్ లు సిరిగిరి శ్రీనివాస్,సందీప్ రావు, వినమల్ల రెడ్డి మరియు మాజీ మార్కెట్ చైర్మన్ సాయిరి మహేందర్, మండల పార్టీ అధ్యక్షుడు చిలుక సతీష్, డిపిఎం నాగేశ్వర్ రావు, ఏపిఎం లు, అధికారులు కాంగ్రెస్ నాయకులు పన్నాల రాములు, కళ్ళేపల్లి జానీ, తిరుమల్ రావు, గుజ్జెట్టి వెంకన్న, బండారి రమేష్, బక్కయ్య, రాజి రెడ్డి, తిరుపతి రెడ్డి, పులి వెంకటేషం, బొజ్జ అజయ్, మురళి, ఆర్నకొండ సాగర్, గడ్డం అనిల్, పోచంపల్లి రాజు, రమేష్, సతీష్, సంపత్ రావు, రాజు, సందీప్, చక్రధర్, సతీష్, రాజన్న, శ్రీనివాస్ రావు మరియు మాజీ సర్పంచ్ లు, ఎంపీటీసీలు, రైతులు, గ్రామస్తులు మరియు తదితరులు పాల్గొన్నారు.