

జనం న్యూస్ ఏప్రిల్ 19(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)
మునగాల మండల కేంద్రంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ మోడల్ ఇంటి నిర్మాణాన్ని కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కాసర్ల కోటేశ్వరరావు, మాజీ వైస్ ఎంపీపీ బుచ్చి పాపయ్య, మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గంధం సైదులు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వం అందజేసే రూ 5 లక్షలతో పూర్తి నిర్మాణం జరుగుతుందని తెలిపారు. లబ్ధిదారులు ఐదు యూనిట్ల వరకు ఇంటి నిర్మించుకుంటే ప్రభుత్వం నుంచి విడుదలవారీగా 5 లక్షల రూపాయలు మంజూరు చేస్తుందని చెప్పారు. లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటు మునగాల తాసిల్దార్ కార్యాలయం లో నిర్మిస్తున్న మోడల్ ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని పరిశీలించాలని ఆయన కోరారు.
