

3.5 తులాల బంగారం స్వాధీనం
24 గంటల్లో దొంగ అరెస్ట్..
ఏసీపీ శ్రీనివాస్ జి
..జనం న్యూస్ // ఏప్రిల్ //18 // కుమార్ యాదవ్,// జమ్మికుంట)
అంతర్ జిల్లా దొంగ అల్లెపు కృష్ణ అరెస్టు చేసి రిమాండ్ చేస్తున్నట్లు ఏసిపి శ్రీనివాస్ జి తెలిపారు. ఇ మధ్య జరిగిన 15 నాడు ఉదయం 9 గంటలకు అల్లెపురెడ్డి కమలమ్మ, భర్త కొమురెడ్డి, కలిసి తనకు ఆరోగ్యం బాగోలేనందున జమ్మికుంటలోని వరుణ్ సాయి ఆసుపత్రికి వెళ్లారు. కాగా ఆసుపత్రిలో డాక్టర్ లేనందున తను, తన భర్త ఇద్దరు కలిసి ఇంట్లో సామాన్లు తీసుకుందాం అని కొండూరి కాంప్లెక్స్, దగ్గరికి వెళ్ళి అక్కడ మెట్ల మీద కూర్చున్నారు. వీరు కూర్చున్న వద్దకు అల్లెపు కృష్ణ, తండ్రి వెంకటయ్య, వయసు 47 సంవత్సరాలు అను అతను, వచ్చి,అమ్మ నేను కనపర్తి కార్యదర్శిని అని, మీ ఇద్దరికి 4000 /- పెన్షన్ పెట్టిస్తా, మీ ఇద్దరివి ఆధార్కార్ట్స్ జిరాక్స్లు కావాలి అని, ఉదయం పూట మీ ఇంటకి వెళ్తే మీరు ఎవరు లేరు అని, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ కనబడ్డారు అని అన్నాడు. అతని మాటలు నమ్మి అతని భార్యని అక్కడి కూర్చోపెట్టి ఆధార్ కార్డు జిరాక్స్లు తీసుకురావడానికి వెల్లాడు. తన భర్త వెళ్లినాక అల్లెపు కృష్ణ ఐసీఐసీఐ బ్యాంకు ముందు కు తీసుకుని వెళ్ళి అక్కడ కూర్చొబెట్టి, అమ్మ నీ ఫోటో తీయాలి, అంటూ నీ ఒంటి మీద బంగారం ఉండకూడదు, అని మాయమాటలు చెప్పి, తనని మోసగించి తన మెడలో ఉన్న బంగారపు పుస్తెలతాడు గొలుసు తీసుకుని, రేషన్ కార్డు పత్రాల కోసం 40 రూపాయలు ఇచ్చి మళ్ళి వస్తా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. బంగారం విలువ అందాద 80,000/- రూ ఉంటుంది. బయటికి వెళ్ళేటప్పుడు ఒంటరి మహిళలు , వృద్ధులు ఇలా పెన్షన్ ఇస్తా అంటే నమ్మకూడదని అలాగే తెలియని వారితో తమ వివరాలను గోప్యంగా ఉంచుకోవాలని అలాగే అనుమానితులు పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని,ఏసీపీ శ్రీనివాస్ జీ మాట్లాడారు. వృద్ధాప్య తల్లిదండ్రుల పిల్లలు తల్లిదండ్రుల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని, తెలిపారు. అలాగే నిందితుడైన అల్లెపుకృష్ణ s/o వెంకటయ్య ని జమ్మికుంట పట్టణ సీఐ వరగంటి రవి , మోహన్ , సదయ్య , అబ్దుల్ ఖదీర్ , శ్రీకాంత్ 36 గంటలలో పట్టుకున్నా, జమ్మికుంట పోలీస్ సిబ్బందిని ఏసీపీ అభినందించారు. ఇతనిపై జమ్మికుంటలో 3 కేసులు,హుజురాబాద్ లో 3కేసులు, కరీంనగర్లో 10 కేసులు రాష్ట్ర వ్యాప్తంగా 85 కేసులు, ఉన్నట్లు తెలిపారు.ఇతను గతంలో రెండుసార్లు (పీడీ) యాక్ట్ కింద నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు, అని ఏసీపీ శ్రీనివాస్ జీ పేర్కొన్నారు.
