

బిచ్కుంద ఏప్రిల్ 19 జనం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం కందర్ పల్లి గ్రామంలో అంగన్వాడి కేంద్రంలో పోషణ పక్వాడ్ కార్యక్రమం అంగన్వాడి టీచర్ విజయలక్ష్మి నిర్వహించడం జరిగింది, పోషన్ పక్వాడ్ భాగంలో పోషక ఆహారము గురించి అంగన్వాడీ టీచర్ మాట్లాడుతూ మనము రోజు తినే ఆహారంలో సూక్ష్మ పోషకాలు శూల పోషకాలు అదేవిధంగా ఆకుకూరలు కూరగాయలు పండ్లు తీసుకోవాలని మరియు పప్పు దినుసులు చిరుధాన్యాలు తినాలని చెప్పారు గర్భిణి బాలింతలు అంగన్వాడి కేంద్రంలో ఒక్క పూట అన్నము తినాలని చెప్పారు ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్మాస్టర్ కళ్యాణి మేడం గ్రామ పంచాయతీ సెక్రెటరీ పూజ మరియు గర్భిణీలు బాలింతలు పిల్లలు పాల్గొనడం జరిగింది

