Listen to this article

జనం న్యూస్ 21 ఏప్రిల్ 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇన్చార్జి డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా

ఈరోజు ఏఐసీసీ సెక్రెటరీ చతిస్గడ్ ఇంచార్జి SAసంపత్ కుమార్ ఆదేశాల మేరకు ఐజ మండలం మేడికొండ గ్రామంలో యాసంగి సీజన్ఐకెపి వరి కొనుగోలు సెంటర్ ను ప్రారంభించిన అల్లంపూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ దొడ్డప్ప గారు ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం సన్నరకం వరి ధాన్యం గిట్టుబాటు ధర 2,320 బోనస్ కింటాకి 500 రూపాయలుఅదనంగా ప్రభుత్వం కల్పించింది వరి పండించిన ఏ రైతుకూడా దళారుల చేతిలో మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రంలో మీరు అమ్ముకున్నట్లయితేఏ లాంటి ఇబ్బందులు లేకుండా గిట్టుబాటు ధర కల్పిస్తూ అదనంగా బోనస్ కూడా వస్తుంది.అని ఆయన మాట్లాడడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మేడికొండ ఎంబి లక్ష్మీ కాంతారావు గారు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఉత్తనూర్ జయన్న గారు, సిసి మౌలాలి సారుగారు, ఏఈఓ శ్రీకాంత్ రెడ్డి గారు, వివోఏ మహేష్,గారు గ్రామ సంఘ లీడర్లు చిన్న సంగం సభ్యురాలు గ్రామ రైతులు గ్రామ ప్రజలు పాల్గొనడంజరిగింది