

జనం న్యూస్ 21 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
విజయనగరం జిల్లాకు చెందిన మహిళ రణస్థలంలో దారుణ హత్యకు గురైంది. పూసపాటిరేగ మం.
పెద్ద పతివాడకి చెందిన భవాని (26) భర్తతో కలిసి పైడిభిమవరం పంచాయతీ గొల్లలపేటలో ఉంటోంది.
పైడిభీమవరంలోని ఓ హోటల్లో పని చేస్తున్న భవాని శనివారం సాయంత్రం ఇంటికి వస్తుండగా చాక్‌తో దుండగులు దాడి చేసి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన భవాని అక్కడికక్కడే మృతి చెందింది.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.