

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్
జనం న్యూస్ 21 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
జిల్లాలో నేరాల నియంత్రణ, అనుమానస్పద వ్యక్తుల ఆచూకీ కనిపెట్టేందుకు ఏప్రిల్ 19న రాత్రి ఆకస్మికంగా లాడ్జిలు, హెూటల్స్ జిల్లా వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు చేపట్టినట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.
జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ ఆదేశాలతో జిల్లాలో శాంతి భద్రతలను పరిరక్షించడం, అసాంఘిక
కార్యకలాపాల నియంత్రణే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా విజయనగరం వన్ టౌన్, టూ టౌన్, కొత్తవలస, ఎస్.కోట,
గజపతినగరం, బొబ్బిలి, రామభద్రపురం, చీపురుపల్లి, రాజాం పోలీసు స్టేషను పరిధిలోని 72 లాడ్జిలు, హెూటల్స్ ఆకస్మిక తనిఖీలు చేపట్టామన్నారు. ఈ తనిఖీల్లో లాడ్జిలు, హెూటల్లో షెల్టర్ తీసుకున్న వ్యక్తుల వివరాలు సేకరించడం, వారు ఎక్కడ నుండి వచ్చింది, ఏ పని మీద వచ్చింది ఎన్ని రోజులు లాడ్జిల్లో బస చేస్తున్నది అన్న విషయాలపై విచారణ చేసి, వారి ఆధార్ మరియు ఇతర గుర్తింపు కార్డులను, లాడ్జి రికార్డులను సంబంధిత పోలీసు అధికారులు పరిశీలించా రన్నారు. లాడ్జి, హెూటల్స్ యజమానులకు గతంలో పోలీసుశాఖ వారు సూచించిన భద్రత ప్రమాణాలు, గైడులైన్సును పాటిస్తున్నది లేనిది, సిసి కెమెరాలను ఏర్పాటు, వాటి పని తీరును పరిశీలించారన్నారు. ఎవరైనా వ్యక్తులు లాడ్జిల్లో అనుమానస్పదంగా బస చేసినా, అనుమానస్పద లగేజులు, వస్తువులు వారితో ఉన్నట్లయితే సమాచారాన్ని పోలీసులకు అందించాలని లాడ్జి సిబ్బందిని పోలీసు అధికారులు ఆదేశించారన్నారు. అసాంఘిక కార్యక్రమాలను ప్రోత్సహించినా, చట్టపరమైన నిబంధనలు పాటించకున్నా లాడ్జి యజమానులు, హెూటల్ యజమానులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని హెచ్చరించారు. భద్రత దృష్ట్యా లాడ్జిల్లో అన్ని ప్రాంతాలు కవరయ్యే విధంగా క్వాలిటీ సిసి కెమెరాలను ఏర్పాటు చేయాలని, లాగ్ రిజిస్టర్లు సక్రమంగా మెయింటేయిన్ చేయాలని లాడ్జి, హెూటల్స్ యజమానులను సంబంధిత పోలీసు అధికారులు ఆదేశించారని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. ఈ ఆకస్మిక లాడ్జి హెూటల్స్ తనిఖీలను విజయనగరం డిఎస్పీ ఎం.శ్రీనివాసరావు, బొబ్బిలి డిఎస్పీ జి.భవ్యరెడ్డి, చీపురుపల్లి డిఎస్పీ ఎస్.రాఘవులు పర్యవేక్షించిగా తనిఖీల్లో సంబంధిత సిఐలు, ఎస్ఐలు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.