

జనం న్యూస్:21 ఎప్రిల్ సోమవారం: సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై రమేష్;
ఈనెల 26 శనివారం రోజున ఉదయం 10 గంటలకు ప్రెస్ క్లబ్ సిద్దిపేటలో కవి వంగరి వెంకటేశం రచించిన సప్తశతి మణిపూసలు పుస్తకావిష్కరణ ప్రెస్ క్లబ్ సిద్దిపేటలో కలదని బాలసాహితీ వేత్త ఉండ్రాళ్ళ రాజేశం అన్నారు. అన్ని పూసల కవిత దినోత్సవం ఏడవ వార్షికోత్సవం సందర్భంగా ఏడు వందల మణిపూసలు పుస్తకావిష్కరణ జరగడం సంతోషమని ఇట్టి కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలు ఆదివారం మధ్యాహ్నం ప్రెస్ క్లబ్ సిద్దిపేటలో ఆవిష్కరణ చేశారు. ముఖ్యఅతిథిగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ జల్లిపల్లి బ్రహ్మం అతిథులుగా అడ్డగూడి ఉమాదేవి, ఆశీర్వాదం, వడిచర్ల సత్యం, మచ్చ అనురాధ, దోమకొండ అంజయ్య, నూనే రాజయ్య, ఐత చంద్రయ్య, పట్నం భూపాల్, సంగీతం నరసింహారావు, కుందారం యాదగిరి, సిహెచ్ రాజు తదితరులు హాజరవుతారని కవులు, రచయితలు, సాహితీ ప్రియులు పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు. ఇట్టి కరపత్ర ఆవిష్కరణలో పుస్తక రచయిత వంగరి వెంకటేశం, జాతీయ సాహిత్య పరిషత్ అధ్యక్షులు ఎన్నవెల్లి రాజమౌళి, పుస్తక సమీక్షకులు వరుకోలు లక్ష్మయ్య, శాడ వీరారెడ్డి, అనిశెట్టి సతీష్ కుమార్, బాలచంద్రం, నూనె రాజయ్య, యాదగిరి, చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.