

ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి, జనవరి 16 (జనం న్యూస్):-
అన్నమయ్య జిల్లా: కురబలకోట మండలంలోని అంగళ్లు సమీపాన గురువారం వేకువజామున బస్సు బోల్తా పడ్డ సమాచారం తెలుసుకున్న జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాలతో మదనపల్లి డిఎస్పి కొండయ్య నాయుడు, సీఐలు రామచంద్ర, రమేష్, కళా వెంకటరమణ ఆగమేఘాలపై కురబలకోట మండలానికి చేరుకున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం నుండి బెంగళూరుకు వెళుతున్న ప్రైవేటు బస్సు బోల్తా పడి గాయపడ్డ క్షతగాత్రులను దగ్గరుండి కురబలకోట, వాల్మీకిపురం 108 సిబ్బంది మనోహర్, భావాజాన్, తదితరులు అంబులెన్స్ వాహనాలలో మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు దగ్గరుండి చేయించారు. పలువురు గాయపడగా సకాలంలో సహాయక చర్యలు, వైద్య చికిత్సలు అందించడంతో ప్రాణాపాయం తప్పిందని స్థానిక ప్రజలు, బాధిత ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు.
సహాయక చర్యలో పాల్గొన్న డి.ఎస్.పి, సీఐ లు, సిబ్బంది. బోల్తాబడిన బస్సును జెసిబి సాయంతో యధాస్థితికి చేర్చిన పోలీసులు.దొంగలు లగేజీలు చోరీలకు పాల్పడకుండా బాధితులకు లగేజీలను అప్పగించి సహాయక చర్యలో పాల్గొన్నారు.