Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 22(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)

మునగాల మండల పరిధిలోని రేపాల గ్రామ శివారులో సోమవారం కూలీలతో నరసింహుల గూడెం నుండి మొద్దుల చెరువు వైపు కూలీలతో వెళుతున్న ఆటో రేపాల గ్రామ శివారులోకి రాగానే అదుపుతప్పి పల్టీ కొట్టింది, ఈ ప్రమాదంలో చిలుకూరు మండలం చెన్నారి గూడెం గ్రామానికి చెందిన కాంపాటి వెంకటయ్య, కాంపాటి అంతమ్మ, కొండమీది సరోజ, మాతంగి వెంకటమ్మ, మాతంగి నాంచారమ్మ కు తీవ్ర గాయాలు కాగా మరో నలుగురు కూలీలకు స్వల్ప గాయాలు అయ్యాయి, బేతవోలు గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ ఆటోలో గత కొద్ది రోజులుగా దినసరి కూలీలుగా పని చేసుకుంటుండగా సోమవారం మండల పరిధిలోని నరసింహులగూడెం గ్రామంలో ఒక రైతుకు చెందిన వరి పంట గడ్డి కట్టేందుకు వెళ్లి తిరుగు ప్రయాణంలో ఆటో బోల్తా కొట్టిన ప్రమాదంలో కూలీలు గాయాలకు గురయ్యారు, స్థానికులు క్షతగాత్రుల్ని చికిత్స నిమిత్తం 108 వాహనంలో వైద్యశాలకు తరలించారు.