

వడగాల్పులకు పెద్ద పాపయ్యపల్లి గ్రామంలో కుప్పకూలిన రేకుల షెడ్డు.
గుండేటి సరిత కుటుంబానికి అండగా ఉంటానన్న కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రణవ్..
ఘటనా స్థలాన్ని పరిశీలించి, ప్రమాదంపై విచారం వ్యక్తం చేసిన కాంగ్రెస్ నాయకులు.
ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయించి ఇస్తానని హామీ ఇచ్చిన ప్రణవ్..▪️
అందుబాటులో లేకపోయినా ఫోన్లో స్పందించి కుటుంబానికి అండగా ఉంటాను అన్న ప్రణవ్
..జనం న్యూస్ // ఏప్రిల్ // 21 // జమ్మికుంట // కుమార్ యాదవ్..కరీంనగర్ జిల్లా
హుజురాబాద్ నియోజకవర్గం హుజురాబాద్ మండల పెద్ద పాపయ్యపల్లి గ్రామానికి చెందిన గుండేటి సరిత-శివ ఈదురు వడగాలులకు రేకుల షెడ్డు కుప్పకూలడం జరిగినది. ప్రజా ప్రతిభ కథనానికి స్పందించిన అధికారులు సోమవారం రోజు ఉదయం హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వోడతల ప్రణవ్ ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కుప్పకూలిన రేకుల షెడ్డును సందర్శించడం జరిగినది. పూర్తిగా దగ్ధమైనా రేకుల షెడ్డును, చూసి కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ప్రణవ్ కు తెలియజేయడం జరిగినది. విషయం తెలుసుకున్న ప్రణవ్ ఫోన్ ద్వారా బాధితురాలతో మాట్లాడి మీకు అండగా ఉంటానని, అలాగే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.అలాగే ప్రమాదం జరగడానికి గల కారణాలను బాధితురా లను, స్థానికులను ప్రణవ్ అడిగి తెలుసుకున్నారు. కూలి పని చేసుకుని జీవనం సాగిస్తున్న గుండేటి సరిత-శివ కుటుంబం ఇల్లు కుప్పకూలడం తో ఏమి తోయని స్థితిలో ఉన్నారు. ఆ కుటుంబాన్ని ప్రభుత్వం తరఫున, నా తరఫున అన్ని విధాలా ఆదుకుంటానని కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వోడతల ప్రణవ్ హామీ ఇచ్చారు.ఇంటి స్థలంలో ఇందిరమ్మ ఇల్లు కట్టుకునేందు కు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొల్లూరి కిరణ్ కుమార్, మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పుల్ల రాధ, హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జి మిడిదొడ్డి రాజు, హుజురాబాద్ మండల కాంగ్రెస్ నాయకులు ఉమాపతి రావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్స్ యండి చాంద్ పాషా, బండారి సదానందం, సమ్మెట సంపత్, పెద్ద పాపయ్యపల్లి గ్రామశాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోషు రాజమౌళి, ఇంద్రసేనారెడ్డి, కృష్ణమూర్తి, రాజమౌళి, తలకొక్కుల రవి, ఓదెలు తదితరులు పాల్గొనడం జరిగింది.