Listen to this article

.జనం న్యూస్. ఏప్రిల్ 21. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్)

రైతన్నకు వాన గుబులు పట్టుకుంది. రాత్రనక పగలనక చెమటోర్చి కష్టపడి పండించిన ధాన్యం కళ్ళముందే వర్షానికి కొట్టుకుపోవడంతో చలించిపోయి కంటతడి పెడుతున్న రైతన్నలు. సోమవారంనాడు అకస్మాత్తుగా కురిసిన వర్షానికి ధాన్యం తడిసి ముద్దయ్యింది.హత్నూర మండలంలోని కొన్యాల మధుర హత్నూర వివిధ గ్రామాల్లో మోస్తరు వర్షం కురిసింది. దీంతో రైతులు కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం తడవకుండా ప్లాస్టిక్‌ కవర్లు తీసుకొచ్చి కప్పారు.వరదలో కొంత ధాన్యం కొట్టుకుపోయింది.గత వారం రోజుల నుండి కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం నిల్వలు పేరుకుపోయాయి., అదేవిధంగా కొన్యాల గ్రామానికి చెందిన రైతులు కురుమ నరసింహులు ,జగంపేట బీరప్ప, పుట్టి బిక్షపతి, గంగులు. ఇటిక్యాల కొండయ్య, కొనుగోలు కేంద్రం వద్ద ఆరబోసిన కుప్పలను వర్షపు నీరు చుట్టుముట్టి వరద ప్రభావంతో కొట్టుకుపోయి నష్టపోయామని ప్రభుత్వం ఆదుకోవాలని పుట్టెడు దుఃఖంతో రైతులు తమఆవేదన వ్యక్తం చేశారు. ఈదురుగాలులతో కూడిన వర్ష ప్రభావంతో కొన్ని చోట్ల స్తంభాలు చెట్లు.విరిగి విద్యుత్ అంతరాయం కలిగింది.