

జమ్మికుంట తాసిల్దార్ రమేష్ బాబు..
జనం న్యూస్ // ఏప్రిల్ // 22 // కుమార్ యాదవ్ // జమ్మికుంట)
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం లో విలాసాగర్ గ్రామంలో సోమవారం పరిసర ప్రాంతంలో ఉన్న మానేరు వాగు నుండి అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ఐదు ట్రాక్టర్లను జమ్మికుంట తహసిల్దార్ గట్ల రమేష్ బాబు తన సిబ్బందితో పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి అనుమతులు లేకుండా ఎవరైనా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా మానేరు వాగు నుండి ఇసుక తరలిస్తే కఠిన చర్యలు ఉంటాయని అన్నారు. నాలుగు ట్రాక్టర్లు ఇసుక తరలిస్తుండగా, అలాగే ఒక ట్రాక్టర్ ఇసుక లోడ్ చేస్తుండగా పక్క సమాచారం తో తనిఖీ చేయగా పట్టుబడిన ఐదు ఇసుక ట్రాక్టర్లల పైన కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా అక్రమంగా ఇసుక తరలిస్తే చట్టపరంగా కేసు నమోదు చేసి జరనామ విధించడం జరుగుతుందని జమ్మికుంట తహసిల్దార్ గట్ల రమేష్ బాబు వివరించారు.
