

జనం న్యూస్ ఏప్రిల్ 22 ముమ్మిడివరం ప్రతినిధి :
కేంద్ర ఉక్కు మరియు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ సోమవారం బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి మోకా వెంకట సుబ్బారావు స్వగృహానికి విచ్చేసారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీ ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి వెంట బిజెపి పూర్వపు జిల్లా అధ్యక్షులు యాళ్ల దొరబాబు, అముడా చైర్మన్ అల్లాడ స్వామినాయుడు, మాజీ మున్సిపల్ చైర్మన్ చిక్కాల గణేష్, టిడిపి సీనియర్ నాయకులు గంధం పల్లంరాజు, బిజెపి పాలూరు సత్యానందం బిజెపి మట్ట సూరిబాబు అల్లాడ శరత్, రేవు శ్రీను, రాయపురెడ్డి రాజా, దున్నాల దుర్గ తదితరులు పాల్గొన్నారు.
