Listen to this article

జనం న్యూస్ 16 జనవరి కోటబొమ్మాళి మండలం. రాష్ట్ర పురోభివృద్ధికి యువత పాత్ర అత్యంత కీలకమైనదని, రాష్ట్ర సంపద సృష్టించడంలో యువకుల కృషి అవసరమని రాబోవు తరాలకు యువత మార్గదర్శకులుగా నిలబడాలని, ప్రజలను చైతన్యవంతం చేయడంలో యువకులకు రాజకీయాలు అవసరమని యువత రాజకీయాల్లోకి రావడం ద్వారా రాష్ట్ర పురోభివృద్ధి సాధ్యమని రాష్ట్ర వ్యవసాయశాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. అఖిలభారత యువజన సమాఖ్య ( ఏఐవైఎఫ్‌ ) రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘ పత్రికను నిమ్మాడ తన క్యాంపు కార్యాలయంలో ఆయన విడుదల చేశారు. శ్రీకాకుళం నగరంలో ఫిబ్రవరి 6వ తేదీ నుంచి 9వ తేదీ వరకు జరుగుతున్న ఏఐవైఎఫ్‌ రాష్ట్ర మహాసభలు విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆహ్వాన సంఘ అధ్యక్షులు చాపర సుందర లాల్‌, సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర. వెంకటరమణ, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి లండ వెంకటరావు ఆహ్వాన సంఘ ప్రధాన కార్యదర్శి మొజ్జాడా యుగంధర్‌, ఆహ్వాన సంఘం ఆర్గనైజింగ్‌ కార్యదర్శి కొన్న శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అన్నా క్యాంటీనుకు రూ. 25వేలు ఆర్థిక సహాయం రాష్ట్ర వ్యవసాయశాఖ, మత్య్సకార, పశుసంవర్థకశాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆర్థిక సహాయంలో స్థానిక ఎన్టీఆర్‌ భవన్‌ అవరణలో పేదలకు రూ. 5లకే రుచికరమైన భోజనం అందిస్తున్న అన్నాక్యాంటీనుకు మండలం కురుడు పంచాయతీ చౌదరి కొత్తూరు గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు నాళ్ళ ఆదినారాయణ (చిన్ని) గురువారం రూ. 25వేలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. తన సోదరుడు నాళ్ళ లక్ష్మీనారాయణ ప్రధమ వర్థంతి సందర్భంగా అందజేస్తున్నానని ఈ మొత్తాన్ని అన్నాక్యాంటీన్‌ నిర్వహాకులు లాడి శ్రీనివాస్‌కు అందజేశానని ఆయన తెలిపారు.