

జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఏప్రిల్ 22
తర్లుపాడు మండల కేంద్రం అయిన తర్లుపాడు మండల పరిషత్ కార్యాలయం లోని మండపరిషత్ అదుకారులతో మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి సమావేశం నిర్వహించారు ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మండలం లో వేసవి విడిది అవడం తో గ్రామాల్లో నీటి ఏద్దడి ని అరికట్టెందుకు ఏ ఏ గ్రామాల్లో నీటి కొరత ఉన్నదో తెలపాలని సూచించారు, నీటి బోర్ల మరమ్మత్తులు ఎప్పటికి అప్పుడు చేపట్టాలని తెలిపారు, ప్రజాప్రతినిధులు నిధులు అదుకారులు సమన్వయము తో కలిసి పనిచేయాలని మండల అభివృద్ధికి తోడ్పడాలని కోరారు, తర్లుపాడు మండలానికి రిలైన్స్ గోబర్ గ్యాస్ కోసం 1200 ఎకరాలు భూమి అవసరం అని గోబర్ గ్యాస్ పరిశ్రమ ద్వారా 2000 మందికి ఉపాధి, 250 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని దీనికి కౌలుకు భూమి ఇచ్చే రైతుకు ఎకరాకు 30వేలు ఇస్తారని తెలిపారు దీనిపై అందరు ద్రుష్టి సారించి మండల అభివృద్ధికి తోడ్పాటుకు కృషి చేయాలనీ తెలిపారు, నాగేళ్లముడుపు డిజిటల్ అసిస్టెంట్ ఈ కార్యక్రమం లో ఎంపీడీఓ చక్రపాణి ప్రసాద్, ఈపిఓఆర్డీ సుకుమార్, ఏఓ బుర్రి చంద్రశేఖర్,టైపిస్ట్ రమణ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ కోటేశ్వర రెడ్డి,పంచాయితీ కార్యదర్సులు మండల నాయకులు పాల్గొన్నారు