Listen to this article

జనం న్యూస్ జనవరి 17( కొయ్యూరు ప్రతినిధి సూపర్ స్టార్ కృష్ణ )

అల్లూరి సీతారామరాజు జిల్లా,
కొయ్యూరు మండలం, మంప
పంచాయతీ పరిధిలో గల
తుమ్మలబంధ గ్రామానికి చెందిన సెగ్గె. రత్నం
అనారోగ్యం తో ఎనిమిది సంవత్సరాల క్రితం మరణించింది, మరియు
భర్త సెగ్గె. మల్లేష్ కూడా
అనారోగ్యం తో రెండు నెలల
క్రితం మరణించాడు.
మరణించిన దంపతులిద్దరికీ
ముగ్గురు పిల్లలు కలరు.
వారు:-
1. సెగ్గె. శివ గంగ -10వ తరగతి
2. దేవీ దుర్గా -7వ తరగతి
3. విష్ణు-4వ తరగతి
చదువుతున్నారు.
ప్రస్తుతం పిల్లల బాగోగులు
నాన్నమ్మ అగురు అక్కమ్మ
తనకు ప్రతీ నెలా వచ్చే వృద్ధాప్య పింఛను తో
చూస్తుందని తెలిసినది.
చివరకు తెలిసినది
వీరికి నివాసం ఉండుటకు
ఇల్లు కూడా లేదని తెలిసినది.
వీరి పరిస్థితి తెలిసి నేను గూడూరు మండలంలో స్పెషల్ డిప్యూటీ తహసీల్దారిగా పనిచేస్తున్న
(దుమంతి. సత్యనారాయణ )
కనుమ పండుగ (తేదీ.15.01 .2025 ) రోజున,
వారి గ్రామం వెళ్లి ముగ్గురు పిల్లలకు మరియు వారి
నాన్నమ్మ కు బట్టలు మరియు వారి ఖర్చుల నిమిత్తం రూ.2000/- లు ఇవ్వటం జరిగింది.
పిల్లల చదువు లకు సహకరిస్తానని వారికి
తెలియజేసాను.
ఈ కార్యక్రమంలో సర్పంచ్:-
ఇంగువ. రామన్న పడాల్ గారు, దుమంతి. రామకృష్ణ,
అశోక్లాల్ మరియు గ్రామస్తులు
వీరబాబు, లోవరాజు తదితరులు
పాల్గొన్నారు.