Listen to this article

జనం న్యూస్// ఏప్రిల్// 22 // కుమార్ యాదవ్ // జమ్మికుంట

జమ్మికుంట మండలం విలాసాగర్ గ్రామానికి చెందిన సిరిసేటి హర్షవర్ధన్ మంగళవారం విడుదలైన ఇంటర్ ఫలితాలలో రాష్ట్రస్థాయిలో మూడో ర్యాంకు సాధించి తన సత్తాను చాటాడు. చిన్నప్పటినుండి చదువులో చురుకుగా ఉండే హర్షవర్ధన్ పదవ తరగతిలో 9.8 జిపిఏ సాధించాడు. ఆరో తరగతి నుండి పదవ తరగతి వరకు మహాత్మ జ్యోతిరావు పూలే పాఠశాల లో చదివి 9.8 జిపిఎస్ సాధించడంతో హర్షవర్ధన్ ను నారాయణ కాలేజ్ హైదరాబాద్ లో ఇంటర్మీడియట్ లో జాయిన్ అయ్యారు. హర్షవర్ధన్ తల్లిదండ్రులు అశోక్ కవిత సామాన్య రైతు కుటుంబం కు చెందినవారు. తండ్రి ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్ గా పనిచేస్తూ పిల్లలను ఉన్నత స్థాయిలో చూడాలని సంకల్పంతో చదివిస్తుండగా పిల్లలు సైతం తండ్రి ఆశయాలకు అనుకూలంగా కష్టంతో కాకుండా ఇష్టంతో చదివి మంచి ర్యాంక్ సాధించడం పట్ల గ్రామస్తులు అభినందిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇదే ఉత్సాహంతో ఉన్నత చదువులు చదివి మంచి స్థాయికి రావాలని గ్రామస్తులు ఆశీర్వదించారు.