Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 22:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం:

తెలంగాణ విద్యాశాఖ ఆదేశాల మేరకు పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి ఏర్గట్ల ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ బృందం బడిబాట చేపట్టారు. గ్రామంలోని ప్రతి ఇంటింటికి తిరుగుతూప్రభుత్వ పాఠశాలలో ఉన్న సౌకర్యాలను తెలుపుతూ, నాణ్యమైన విద్యను అందిస్తున్నామని, డిజిటల్ తరగతులను బోధిస్తున్నామని, విజ్ఞాన విహార యాత్రలు చేపడుతున్నామని, సాంస్కృతిక కళా రంగాలలో విద్యార్థులు చక్కని విజయాలు సాధిస్తున్నారని, ఆటపాటలలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ముందంజలో ఉన్నారని తెలుపుతూ, విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలకే పంపించాలని పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు కొమరగిరి కృష్ణాచారి తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఎక్కువమంది పనికి ఆహార పథకం కింద ఉపాధి హామీలో పనిచేస్తున్నారని తెలిసి పాఠశాల ఉపాధ్యాయ బృందం అక్కడికి వెళ్లి విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడడం జరిగింది. ప్రభుత్వం చేపడుతున్న అనేక కార్యక్రమాల గురించి తెలుపుతూ, విద్యారంగాన్ని ఏ విధంగా ముందుకు తీసుకు వెళ్తుందో తెలుపుతూ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి సౌకర్యాల గూర్చి విద్యార్థుల తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు తెలపడం జరిగింది. విద్యార్థులందరినీ ప్రభుత్వ పాఠశాలలోకి పంపించాలని మేము నాణ్యమైన విద్య అందిచగలమని వారితో తెలపడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ తప్పకుండా విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలోకి పంపిస్తామని వారు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మునీరుద్దీన్, ప్రసాద్, రాజశేఖర్, విజయ్ కుమార్, రాజనర్సయ్య, ప్రవీణ్ శర్మ, గంగాధర్, గంగా మోహన్, ట్వింకిల్, నరేష్, శ్రీనివాస్, జ్యోతి, సబిత పాల్గొన్నారు.