Listen to this article

జనం న్యూస్,పార్వతీపురం మన్యం జిల్లా ,ఏప్రిల్ 23:

సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వ ప్రీ మెట్రిక్ బాలికల వసతిగృహం, పార్వతీపురంలో చదువుతున్న విద్యార్థినులు పదవ తరగతి ఫలితాలలో విశేష ప్రతిభ చూపారు. మొత్తం 22 మంది విద్యార్థుల్లో ఐదుగురు విద్యార్థినులు 500 కి పైగా మార్కులు సాధించి మునుపెన్నడూ ఈ వసతిగృహంలో లేని ఫలితాలను నమోదు చేశారు. విద్యార్థినులకు నాణ్యమైన విద్య, శ్రద్ధతో కూడిన మార్గనిర్దేశనం అందించేందుకు గతంలోనే పార్వతీపురం జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేక శ్రద్ధ చూపుతూ స్వయంగా వసతిగృహాన్ని సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా 558 మార్కులు సాధించిన గల్లావిల్లి అనిత అనే విద్యార్థినిని జిల్లా సోషల్ వెల్ఫేర్ అధికారి గయాజుద్దీన్ గారు తన కార్యాలయంలో సత్కరించారు. విద్యార్థినికి అభినందనలు శుభాకాంక్షలు తెలిపారు. వసతిగృహంలోని వార్డెన్ శ్రీమతి కురుమమ్మను ఈ విజయానికి కారకురాలిగా గుర్తించి ప్రశంసించారు.