

*కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బుచ్చిరెడ్డి* జనం న్యూస్ ఏప్రిల్ 25 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని చౌరస్తా వద్ద జమ్మూకాశ్మీర్లోని పహాల్గంపై ఉగ్రదాడి పిరికిపంద చర్య అని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి అభివర్ణించారు. ఈ మేరకు స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలసి దాడికి నిరసనగా గురువారం సాయంత్రం మండల కేంద్రంలో కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించారు. అనంతరం బుచ్చిరెడ్డి మాట్లాడుతూ.. ఇలాంటి దాడులతో భారతీయ స్ఫూర్తిని దెబ్బతీయలేరని అన్నారు. ఉగ్రవాదం పై కేంద్రం కఠినంగా వ్యవహరించాలని కోరారు. భారతీయులందరూ సంఘటితంగా నిలవాల్సిన సమయం ఇది అని అన్నారు. మృతుల కుటుంబాలకు కాంగ్రెస్ నాయకులు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల నాయకులు చల్ల చక్రపాణి చిందం రవి దుబాసి కృష్ణమూర్తి రఫీ నిమ్మల రమేష్ కొమ్ముల భాస్కర్ మారపల్లి రాజేందర్ రాజు కట్టయ్య మస్క కుమార్ జగన్ వీరన్న రాము తదితరులు పాల్గొన్నారు…..