Listen to this article

జనం న్యూస్ 25 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక : కాశ్మీర్‌ ప్రహల్గామ్‌లో 22-04-2025 న పర్యాటకులపై జరిగిన ఉగ్రవాదుల దాడిని జనసేన పార్టీ తీవ్రంగా ఖండించింది. ఈ దాడిని పిరికిపంద చర్యగా అభివర్ణిస్తూ, ఉగ్రవాదులు ఆర్మీ దుస్తుల్లో రావడం వల్ల మరింత అమానుషమైన చర్యగా మారిందని పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ మూడు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించినట్లు తెలియజేశారు. అందులో భాగంగా రెండవ రోజు రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, విజయనగరం అసెంబ్లీ ఇంచార్జి శ్రీమతి పాలవలస యశస్వి గారు ఆధ్వర్యంలో ఈరోజు సాయంత్రం 6.30 నిమిషాలకు RTC కాంప్లెక్స్ వద్ద జనసేన పార్టీ ఆధ్వర్యంలో సంతాప కార్యక్రమం శాంతియుత కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ దాడిలో మరణించినవారిలో ముగ్గురు తెలుగువారు ఉండటం హృదయవిదారకమని వారు తెలిపారు. టూరిస్టులపై అకస్మాత్తుగా కాల్పులు జరపడం క్రూరమైన చర్య అని పేర్కొన్నారు.ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు జనసేన పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని, వాళ్ళ కుటుంబానికి యావత్ భారత దేశం మొత్తం అండగా ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమం లో విజయనగరం జిల్లా ముఖ్య నాయకులు రౌతు సతీష్ , బొబ్బాది చంద్రి నాయుడు,తురాల శ్రీనివాస్ మరియు విజయనగరం నియోజకవర్గం టౌన్, మండల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.