Listen to this article

భారత పౌరుల జోలికొస్తే ఊరుకోం….

ఆసిఫాబాద్ లో నమాజ్ అనంతరం నిరసన

జనం న్యూస్ ఏప్రిల్ 25 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో భారత పౌరుల జోలికి వస్తే ఊరుకునేది లేదని , ఉగ్రవాదుల్లారా ఖబర్దార్ అని జామా మస్జిద్ ఇమామ్ మొహమ్మద్ అయాజ్ అష్రఫీ , నాయకులు అబ్దుల్ ఫయాజ్ , అబ్దుల్ రహమాన్ అన్నారు. శుక్రవారం కాశ్మీర్ లోని పహల్గాం లో జరిగిన ఉగ్రవాదుల దాడికి ఖండిస్తూ ముస్లింలు నల్ల బ్యాడ్జీలు ధరించి నమాజ్ అనంతరం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమాయకులైన భారత పౌరులపై ఉగ్రవాదులు దాడి చేయడం సిగ్గుచేటని , ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కొంతమంది ఇస్లాంకు చెడు పేరు తేవాలని కుట్రలు పన్నుతున్నారన్నారు. సమైక్యతకు నిదర్శనం భారతదేశమన్నారు. భారతదేశ సమైక్యతను దెబ్బతీసే విధంగా కుట్రలు పన్నుతున్న ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రతి ఒక్క భారత పౌరుడు ఈ దాడికి ఖండించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు షబ్బీర్ , సాజిద్, సాలం , ఎండి అహ్మద్, తాజ్, ఇమ్రాన్ , లాయక్ హుస్సేన్ , షాహిద్ హుస్సేన్, అఖిల్, ముబాషిర్ , నజీర్ , యువకులు తదితరులు పాల్గొన్నారు.హుదా మస్జీద్ లో..కాశ్మీర్ లోని పహల్గాం లో జరిగిన ఉగ్రవాద దాడి అమానుషం. ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ జిల్లా కేంద్రంలోని హూద మస్జిద్ లో జుమా నమాజు అనంతరం ముస్లింలు చేతికి నల్ల రిబ్బన్ కట్టుకొని నిరసన తెలిపారు. ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో మస్జిద్ ముతవల్లి సైద్ బీన్ మొహసిన్ , మస్జిద్ అధ్యక్షుడు ముబిన్ , నాయకులు అలీ బిన్ అవద్, ఫైసల్ బిన్ మొహమ్మ , గులాం జవిద్, అబ్దుల్లా బిన్ ఉమర్ , మోసిన్ బిన్ అమర్ , అవున్ బిన్ అలీ, ఖాళీద్ బిన్ అబ్దుల్లా, హసన్ బిన్ ఖలీద్, అఖిల్ , తదితరులు పాల్గొన్నారు.