Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 25 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజవర్గం కౌటాల మండల కేంద్రాలలోని రైతు వేదికలలో జరిగిన నూతన భూ భారతి చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ తొ పాటు ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే జాయింట్ కలెక్టర్ డేవిడ్ కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్ల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దండే విఠల్ మాట్లాడుతూ ధరణి ధనవంతులకు లాభం చేసింది తప్ప పేద ప్రజలను అభాసు పాలు చేసింది అని తెలిపారు .భూభారతి చట్టంతో పేద ప్రజలకు ధరణి వల్ల నష్ట పోయినా వారికి ఊరట కలుగుతుంది అని ఆయన అన్నారు. ప్రజాపాలనలో భూభారతి చట్టంలో ప్రతీ ఒక్క రైతుకు మేలు జరుగుతుందని ప్రతి ఒక్కరూ నూతన చట్టంపై అవగాహన కలిగి ఉండాలి అని ఉమ్మడి అదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ దండే విఠల్ అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు అధికారులు నాయకులు రైతులు పాల్గొన్నారు.