Listen to this article

దళితులను అన్ని విధాలుగా మోసం చేసిన బిఆర్ఎస్ చరిత్రలో నిలిచిపోతుంది..

దళిత ముఖ్యమంత్రి హామీ నేరెళ్ల ఘటన ఇంకా దళితులు మరిచిపోలే..

బిఆర్ఎస్ ను ఇక నమ్మే పరిస్థితిలో లేదు ప్రజానీకం..

అభివృద్ధి,సంక్షేమ పథకాల అమలును చూసి జీర్ణించుకోలేక కాంగ్రెస్ పార్టీపై విమర్శలు..

పదేండ్ల కల్వకుంట్ల పాలనలో జరిగింది అభివృద్ధి కాదు విధ్వంసమే..

యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు అంబాల శ్రీకాంత్ (బక్కి)..

జనం న్యూస్ 25 ఏప్రిల్ 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్) తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి దళితుడే అని మోసం చేసిన హామీ దళితులపై సిరిసిల్ల జిల్లాలోని నేరెళ్ల లో జరిగిన ఘటన ఇంకా దళితులు మర్చిపోలేదు అన్నారు యూత్ కాంగ్రెస్ ఎల్కతుర్తి మండల అధ్యక్షుడు అంబాల శ్రీకాంత్ (బక్కి) గురువారం రోజున రోజున విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిల్వతో ఉన్న రాష్ట్ర బడ్జెట్ ను తన కుటుంబానికి అక్రమంగా రాష్ట్ర సంపాదన దోసి పెట్టారని అన్నారు కెసిఆర్ దళిత ముఖ్యమంత్రి దళితులకు మూడెకరాలు దళిత బంధు అంటూ తడిగుడ్డ లో కత్తి పెట్టి కోసినట్టుగా దళితుల పట్ల వ్యవహరించారని మండిపడ్డారు రాష్ట్రవ్యాప్తంగా బిఆర్ఎస్ పరిపాలనలో దళితులకు అవమానాలు జరిగాయి తప్ప ఎలాంటి న్యాయము జరగలేదని పేర్కొన్నారు కెసిఆర్ ఇంకా 100 భారీ బహిరంగ సభలు పెట్టిన 10 ఏండ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండబోతుందని ఇందులో న్యాయ నిర్ణీతలు ప్రజలేనని ప్రజా పాలన ప్రభుత్వం ప్రజలకు ఏం చేస్తుందో ప్రజలకె తెలుసు అని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం పై బురద చల్లడం కోసం మైకులు పెట్టి మొత్తుకున్న కూడా బిఆర్ఎస్ పార్టీని ప్రజలు ఇక నమ్మే పరిస్థితులు లేరని ఎద్దేవా చేశారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ,200 యూనిట్ల ఉచిత విద్యుత్ వ్యవసాయ రంగానికి 24 గంటల కరెంటు, రైతు రుణమాఫీ, ప్రతి క్వింటాకు 500 రూపాయల బోనస్,రైతు భరోసా, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇండ్లు ప్రతి నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్ గురుకుల విద్యార్థులకు 40 శాతం డైట్ అండ్ కస్మోటిక్స్ చార్జీల పెంపు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే బిఆర్ఎస్ మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందించడం ఇష్టం లేక జీర్ణించుకోలేక కాంగ్రెస్ పార్టీపై లేని పోనీ ఆరోపణలు చేస్తున్నారని అన్నారు తెలంగాణ ప్రజలు బిఆర్ఎస్ ప్రతిపక్ష హోదా ఇచ్చి ప్రజల వైపున కొట్లాడమంటే నెలనెల ఎమ్మెల్యే జీతం తీసుకుంటూ ఫామ్ హౌస్ లో పడుకోవడము ఏంటి అని అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వడానికి అనుభవజ్ఞునిగా కెసిఆర్ అసెంబ్లీకి వస్తే బాగుంటుందని అన్నారు