

జనం న్యూస్ 26 ఏప్రిల్ పెగడపల్లి ప్రతినిధి : జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లోని వ్యవసాయ మార్కెట్ కమిటి -పెగడపల్లి కార్యాలయం నందు ఈరోజు నూతన పాలక వర్గ మొదటి సాదారణ సమావేశం అధ్యక్షులు బుర్ర రాములు గౌడ్ అధ్యక్షతన నిర్వహించడమైనది. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ధర్మపురి శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు లక్ష్మణ్ కుమార్ మరియు వ్యవసాయ శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు సహకారంతో మార్కెట్ యార్డును అభివృద్ధి పథంలో నడిపిస్తామని అన్నారు. ఈ కార్యక్రమలో వైస్ చైర్మన్.సురకంటి సత్తి రెడ్డి,కార్యవర్గ సభ్యులు,కార్యదర్శి.ఏ. వరలక్ష్మి పాలకవర్గ సభ్యులు చెట్ల కిషన్ చాట్ల విజయభాస్కర్ మేకల మల్లయ్య అంజన్న నాయక్ శ్రీరామ్ అంజయ్య బాలసాని శ్రీనివాస్ మన్నె గంగారాజ్యం లావణ్య లింగంపల్లి మహేష్ శ్రీకాంత్ రెడ్డి అడుప తిరుపతి కర్ర భాస్కర్ రెడ్డి. దేశెట్టి లక్ష్మీరాజం పాలకవర్గము, సిబ్బంది పాల్గొన్నారు.