

జనం న్యూస్ ఏప్రిల్ 26 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో : ఏజెన్సీ ప్రాంతంలో గీత వృత్తినే నమ్ముకొని జీవిస్తున్న గీత కార్మికుల సమస్యలను తెలంగాణ శాసనమండలిలో ప్రస్తావించడం జరిగిందని ఎమ్మెల్సీ దండె విట్టల్ పేర్కొన్నారు. భూ భారతి ఆహ్వాన కార్యక్రమంలో పాల్గొని అనంతరం తిర్యాని మండల గౌడ కులస్తుల ఆహ్వానం మేరకు మండల కేంద్రంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయాన్ని సందర్శించి ముక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్న గౌడ కులస్తుల బాధలు తనకు తెలుసునని పేర్కొన్నారు. గౌడ కులస్తుడు పొన్నం ప్రభాకర్ గౌడ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉండడంతో ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్న గౌడ కులస్తుల సమస్యల పరిష్కారాన్ని మార్గం దొరుకుతుందని పేర్కొన్నారు. గౌడ కులస్తుల వెన్నంటే ఉండి అవసరమైతే ముఖ్యమంత్రి వద్దకు వెళ్లిన వారి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొక్కిరాల విశ్వప్రసాద్ జిల్లా నాయకులు జువ్వాజీ అనిల్ గౌడ్ సహాయ సహకారాలతో గుడి అభివృద్ధి కోసం పరారీ గోడ తో పాటు గౌడ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా గౌడ కులస్తులు ఎమ్మెల్సీ దండేవిట్టలను జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విశ్వప్రసాద్ ను శాలువాలతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు జువ్వాజి అనిల్ గౌడ్, మోకు దెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షులు తాళ్ల శ్రీనివాస్ గౌడ్, మొక్కు దెబ్బ రాష్ట్ర ప్రచార కార్యదర్శి మార్క శంకర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చిత్తారి సాగర్, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు పెరుమండ్ల వెంకటేశం గౌడ్, గౌడ సంఘం నాయకులు పెరుమండ్ల లచ్చ గౌడ్, గౌడ కులస్తులు గుర్రపు బాపు, తీగల నరస గౌడ్, గున్నాల సత్య గౌడ్, పెరుమండ్ల బాలేష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మోకు దెబ్బ నాయకులు గౌడ యువజన సంఘం తదితరులు పాల్గొన్నారు.