

తెలంగాణ ఉద్యమ కారుల ఫోరమ్ చైర్మన్ కనకం కుమారస్వామి.
జనం న్యూస్ 26 ఏప్రిల్ 2025 ( ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్) తెలంగాణ ఉద్యమములో ఉద్యమం సమయంలో ఎన్నో కేసులు అయి జైలల్లో వున్నా వారికి తెలంగాణ రాష్ట్రము సాధించుకోని 11 సంవత్సరాలు గడిచిన ఉద్యమ కారులకు 250 చదరపు అడుగుల ఇంటి స్థలం కేటాహించలేదు.శనివారం రోజునా విలేకరుల సమావేశంలో ఉద్యమ సమయంలో భార్య పిల్లలను వదిలి ఉద్యమం లొ పాల్గొని మహిళలు, పౌరులు పాల్గొని జైలుకు వెళ్ళినారు. ఎన్నో బాధలు పడ్డారు. తెలంగాణ రాష్ట్రము ఏర్పాటులో తెలంగాణ ఉద్యమ కారుల పాత్ర పెద్దది. ఉద్యమ కారులకోసం కొట్లాడుతున్నాము.తెలంగాణ రాష్ట్రము ఏర్పాటు అయ్యాక ఉద్యమ కారులకు ఇంటి స్థలాలు 250 చదరపు అడుగులు ఇస్తానని ఈ రోజు వరకు ఎ ఒక్కరికి ఇవ్వలేదు. నేడు జరిగే బి ఆర్ ఎస్ సభలోతెలంగాణ ఉద్యమ కారులకు ఇంటి స్థలాలు ఇవ్వాలని మాట్లాడితే కాంగ్రెస్ ప్రభుత్వం కొంచమన్న కరిగి ఇస్తుందో అన్న చిన్న ఆశ. సభలో కెసిఆర్ మాట్లాడకపోతే మళ్ళీ ఎలక్షన్స్ లొ మళ్ళీ బొంద పెడ్తామని హెచ్చరించారు.కాంగ్రెస్ మేనిపెస్టో లొ పెట్టిన విదంగా ఇంటి స్థలాలు ఇవ్వాలని కోరారు. తెలంగాణ ఉద్యమ కారుల ఫోరమ్ ఎల్కతుర్తి మండల కో ఆర్డినేటర్ గా నిమ్మల మనోహర్ ను నియమించినట్టు తెలిపారు. జైలు కెళ్ళినా ఉద్యమ కారులను శాలువాతో సన్మానిచ్చారు. ఈ కార్యక్రమం లొ వివిధ మండలాల అధ్యక్షులు మాదాసు శ్రీనివాస్, మోటం సంపత్, అయిలేని సంజీవ రెడ్డి, భూమా సదానందం ఉద్యమ కారులు పుట్ట ప్రతాప్,వజ్రమ్మ, సత్తమ్మ, రమేష్, మర్రిశ్రీనివాస్, జూపాక శ్రీనివాస్, మేకల రాజయ్య,పల్లె సమ్మక్క, అమరేందర్ తదితరులు పాల్గొన్నారు.