

జనం న్యూస్ కాట్రేనికోన ఏప్రిల్ 26 ( ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ)
కాట్రేనికోన మండలం పెనుమెల్ల(సావరం) అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134 జయంతి మహోత్సవములు ఘనంగా జరిగాయి కార్యక్రమానికి ఈ ముఖ్య అతిథులుగా అమలాపురం పార్లమెంట్ సభ్యులు హరీష్ మాధుర్ ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల బుచ్చిబాబు రాజు విచ్చేసినారు మొదట అంబేద్కర్ నిలువెత్తు విగ్రహానికి పూలమాల అలంకరణ చేసినారు తదుపరి అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరం ను ఎమ్మెల్యే బుచ్చిబాబు ప్రారంభించినారు అనంతరం జరిగిన బహిరంగ సభలో ఎమ్మెల్యే మరియు ఎంపీ ఇరువురు ప్రసంగిస్తూ అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు ఎంప్లాయిస్ కి సన్మానం మరియు అకాడమిక్ ఆ చివర్స్ కి మరియు యువ కవి ఎలిపే మధుకి సన్మానం జరిగింది ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ చెల్లి అశోక్ మరియు మండల వైసీపీ నాయకులు కోలాటి సత్యం టిడిపి సీనియర్ నాయకులు నాగిడి నాగేశ్వరరావు మాజీ వేసుకుపట్ల వెంకటేశ్వరరావు టిడిపి మండల అధ్యక్షులు నడింపల్లి సుబ్బరాజు దళిత నాయకులు నల్ల నరసింహమూర్తి సర్పంచులు వంకాయ ఏడుకొండలు గుత్తుల సత్యనారాయణ రంబాల రామారావు గంటి సుధాకర్ మోకా రామారావు ఎంపీటీసీ ధనుంజయ్ తదితరులు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.