Listen to this article

ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి జనవరి 17 (జనం న్యూస్):-

ప్రకాశం జిల్లా: గిద్దలూరు మండలం దేవనగరం గ్రామంలో రూ.50 నగదు చెల్లింపు విషయంలో కోటేశ్వర్ రెడ్డి అనే వ్యక్తిపై గ్రామానికి చెందిన శ్రీకాంత్ పదునైన ఆయుధంతో దాడికి పాల్పడ్డాడు. కోటేశ్వర్ రెడ్డికి తీవ్ర గాయాలు కావడంతో గిద్దలూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. శ్రీకాంత్ తండ్రి నరసింహులు గ్రామంలో మద్యం బెల్టు షాపు నిర్వహిస్తున్నాడని బాధితులు ఆరోపించారు. 2 రోజుల క్రితం నరసింహులు, నారాయణరెడ్డిపై దాడి చేయగా ప్రశ్నించినందుకు కోటేశ్వర్ రెడ్డి పై నరసింహులు కుమారుడు శ్రీకాంత్ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.